![Vijay chandar Demands Tollywood Celebrities Respond On Support To Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/16/actor-Vijaya-Chandra.jpg.webp?itok=M4XlB0hS)
నటుడు విజయ్ చందర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపిందన్న వార్తలపై సినీ పరిశ్రమ పెద్దలు సమాధానం చెప్పాలని నటుడు విజయ్‌చందర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై తాను స్పష్టత కోరానని, అయితే కేవలం వ్యక్తిగత మద్దతేనని అడహక్ కమిటీ చైర్మన్ కేఎల్ నారాయణ తెలిపారని అన్నారు. ఇందుకు సంబంధించి మిగిలిన నలుగురు కూడా స్పష్టత ఇవ్వాలని విజయ్ చందర్ పేర్కొన్నారు. సేవా సహాయ కార్యక్రమాల్లో మాత్రమే సినీ పరిశ్రమ ఒకేతాటిపై ఉంటుందని, రాజకీయ అంశాల్లో ఎవరి నిర్ణయం వారిదేనని ఆయన అన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖులు అశ్వనీదత్, కే రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దత ఉంటుందని తెలిపారు. ఇక ఇదే విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి కూడా సీఎం చంద్రబాబుకు చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment