vijay chandar
-
ఆ సినిమా చేసినందుకు నన్ను నేను అసహ్యించుకున్నా
-
నేను చేయలేని పాత్రలు నాతో చేయించుకున్నారు
-
సీఎం జగన్‌ను కలిసిన విజయ్ చందర్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, నటుడు విజయ్ చందర్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్డీసీ చైర్మన్‌గా విజయ్ చందర్ నిన్న (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. చదవండి: విజయ్ చందర్‌కు కీలక పదవి -
నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్ చందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విజయ్ చందర్ కరుణామయుడుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే సాయిబాబాగా కూడా ఆయన తన నటనతో మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విజయ్ చందర్‌కు తాత అవుతారు. అధికార భాషా సంఘం సభ్యుల నియామకం అధికార భాషా సంఘం సభ్యులుగా నలుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. అధికార భాషా సంఘం సభ్యులుగా మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి నియమితులయ్యారు. -
దమ్ముంటే చాలు
కథలో దమ్ముంటే చాలు ఎటువంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉంటారు విజయ్ సేతుపతి. అలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా డిఫరెంట్ రోల్స్ చేసి యాక్టర్‌గా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఓ చిత్రంలో హీరోగా నటించడానికి అంగీకరించారు. ‘స్కెచ్’ ఫేమ్ విజయ్ చందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా ఫేవరెట్ హీరో విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. విజయ వాహిని ప్రొడక్షన్స్ నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. డబుల్ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు విజయ్ చందర్. ఈ సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘టాలీవుడ్ పెద్దలు సమాధానం చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపిందన్న వార్తలపై సినీ పరిశ్రమ పెద్దలు సమాధానం చెప్పాలని నటుడు విజయ్‌చందర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై తాను స్పష్టత కోరానని, అయితే కేవలం వ్యక్తిగత మద్దతేనని అడహక్ కమిటీ చైర్మన్ కేఎల్ నారాయణ తెలిపారని అన్నారు. ఇందుకు సంబంధించి మిగిలిన నలుగురు కూడా స్పష్టత ఇవ్వాలని విజయ్ చందర్ పేర్కొన్నారు. సేవా సహాయ కార్యక్రమాల్లో మాత్రమే సినీ పరిశ్రమ ఒకేతాటిపై ఉంటుందని, రాజకీయ అంశాల్లో ఎవరి నిర్ణయం వారిదేనని ఆయన అన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖులు అశ్వనీదత్, కే రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దత ఉంటుందని తెలిపారు. ఇక ఇదే విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి కూడా సీఎం చంద్రబాబుకు చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. -
మరెప్పుడూ జత కట్టబోమని చెప్పగలరా?
సాక్షి, రాజమహేంద్రవరం: మొదటిసారిగా తెలుగుదేశం, సీఎం చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భవిష్యత్‌లో మళ్లీ టీడీపీతో కలÐవబోమని ప్రకటించగలరా? అని సినీ నటుడు, వైఎస్సార్సీపీ ప్రచారవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.విజయ్‌చందర్ ప్రశ్నించారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావుతో కలసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. కలసి పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్న భావనతో వేర్వేరుగా పోటీ చేసేందుకు చంద్రబాబు అడుతున్న నాటకంలో భాగంగానే పవన్ కల్యాణ్ విమర్శలు చేశారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. వేర్వేరుగా పోటీ చేసి సీట్లు సాధించి ఆ తర్వాత కలసి అధికారం అనుభవించాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ఉన్నారని ఆరోపించారు. అప్పుడు పవన్‌ను చంద్రబాబు పావుగా వాడుకున్నాడని, ఇప్పడు అదే పావును బయటకు పంపి వాడుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడని ఆరోపించారు. నాలుగేళ్లుగా లేనిది ఇప్పుడే తెలిసినట్టు పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం తనయుడు లోకేష్‌పై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు అవినీతిపై మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మంచివాడని, అమాయకుడని, అయితే సీఎం చంద్రబాబు వేసిన బోనులో చిక్కుకున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ ఆమరణదీక్షకు కూర్చున్న రోజునే తానూ దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రజలు గుణం పాఠం తప్పక చెబుతారు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై అనేక ప్రకటనలు చేసి అవహేళన చేసిన సీఎం చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ఉందనగా హోదాపై పోరాటం చేస్తున్నామంటూ నాటకాలు ఆడుతున్నారని రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. మోదీ పక్కన పెట్టాడని ఇప్పడు ప్రత్యేకహోదా అంటున్నాడని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం అను చెప్పకుంటున్న సీఎం చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో ప్రజలు అధికారం కట్టబెడితే నాలుగేళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు. ఒక్క హమీ కూడా నెరవేర్చని చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ ప్రచారకమిటీ రాష్ట్ర ప్రచారవిభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తిరుపతి సభలో మోదీ, చంద్రబాబు ఇచ్చిన హామీలకు తనది పూచీ అన్న పవన్ కల్యాణ్ ఇప్పడు ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్ పిల్లి నిర్మల, వివిధ విభాగాల అధ్యక్షులు, నేతలు మార్తి లక్ష్మి, పెద్దిరెడ్ల శ్రీను, మార్తి నాగేశ్వరరావు, పోలు విజయలక్ష్మి, పెంకె సురేష్, కాటం రజనీకాంత్, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, కట్టా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
పక్కా స్కెచ్
మనల్ని ఎవరైనా దెబ్బతీస్తే అలా ఊరుకోవద్దు అంటాడు ఆ కుర్రాడు. పక్కా స్కెచ్ గీసుకుని ఎదురెళ్లమంటాడు ఆ నార్త్ చెన్నై కుర్రాడు. అలా అనటమే కాదు ఈ సంక్రాంతికి పక్కా స్కెచ్ గీసుకు వస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? ఎవరికి స్కెచ్ వేస్తున్నారు అంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు విజయ్ చందర్. ఆయన దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమన్నా హీరోయిన్గా రూపొందిన సినిమా ‘స్కెచ్’. వి క్రియేషన్స్ అధినేత కలైపులి.ఎస్. థాను నిర్మించారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో విక్రమ్ ‘కనవే కనవే’ (కనవే అంటే కల అని అర్థం) అని సాగే ఒక పాట కూడా పాడారు. -
అమరజీవికి YSRCP ఘనంగా నివాళి
-
బొజ్జల వర్సెస్ గాలి
ఎత్తుకు పైఎత్తులు డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు చివరి నిమిషంలో చక్రం తిప్పిన బొజ్జల ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తిరుపతి తుడా: అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. జిల్లా డీఆర్వో పోస్టు వ్యవహారం ఇందుకు వేదికైంది. తమకు నచ్చిన.. మెచ్చిన అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముందుగా డీఆర్వో పోస్టులోకి జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సఫలమయ్యారు. తాను మంత్రిగా ఉండగా జిల్లా ఉన్నతాధికారి నియామకం తాను చెప్పిన వారికే దక్కాలని మరో అధికారి ఎం.వెంకటేశ్వరరావు పేరును బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను డీఆర్వోగా దాదాపు పేరు ఖరారైందని మంగళవారం జోరుగా ప్రచారం సాగింది. స్థానికుడైన విజయ్‌చందర్‌ను జిల్లా పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళుతూ డీఆర్వోగా విజయ్‌చందర్ పేరును ఖరారు చేసి వెళ్లారు. మరుసటి రోజు బుధవారం కల్లా ఆ జీవోను పక్కన పెట్టించిన మంత్రి మరో జీవో సిద్ధం చేయించినట్టు సమాచారం. సీఎం లేని సమయంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో గోపాలకృష్ణారెడ్డి ఈ పోస్టు కోసం చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తిరిగి వచ్చేవరకు డీఆర్వో నియామక జీవోను(పాత) పక్కన పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. తాను చెప్పిన ఎం.వెంకటేశ్వరరావు (తిరుపతి పూర్వ ఆర్డీవో) పేరుతో తయారు చేసిన జీవోను విడుదల చేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నిం చేయనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ముద్దుకృష్ణమకు తెలియడంతో మంత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి తిరిగి వచ్చాక ఎవరి మాట చెల్లుతుందో తేలనుంది. అధికారుల బదిలీల్లోనూ.. జిల్లాకు చెందిన అధికారుల బదిలీల్లోనూ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ఎవరికి వారు పోటీ పడుతు పడుతున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల బదిలీల్లో తమకు అనుకూలమైన వారిని వారు కోరుకన్న స్థానాలకు బదిలీ చేయాలని ఇద్దరూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది.