
మనల్ని ఎవరైనా దెబ్బతీస్తే అలా ఊరుకోవద్దు అంటాడు ఆ కుర్రాడు. పక్కా స్కెచ్ గీసుకుని ఎదురెళ్లమంటాడు ఆ నార్త్ చెన్నై కుర్రాడు. అలా అనటమే కాదు ఈ సంక్రాంతికి పక్కా స్కెచ్ గీసుకు వస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? ఎవరికి స్కెచ్ వేస్తున్నారు అంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు విజయ్ చందర్.
ఆయన దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా రూపొందిన సినిమా ‘స్కెచ్’. వి క్రియేషన్స్ అధినేత కలైపులి.ఎస్. థాను నిర్మించారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో విక్రమ్ ‘కనవే కనవే’ (కనవే అంటే కల అని అర్థం) అని సాగే ఒక పాట కూడా పాడారు.