అప్పుడు అర్జున్‌ రెడ్డి నేనే చేసేవాణ్ణి | Vikram Speach at press meet of ” Sketch | Sakshi
Sakshi News home page

అప్పుడు అర్జున్‌ రెడ్డి నేనే చేసేవాణ్ణి

Published Sun, Jan 21 2018 1:12 AM | Last Updated on Sun, Jan 21 2018 1:12 AM

Vikram Speach at press meet of ” Sketch  - Sakshi

‘‘దేశంలో చాలా భాషలు ఉన్నాయి. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నా భాష తెలుగు. చెన్నైలో ఉన్నప్పుడు నా భాష తమిళ్‌. నెక్ట్స్‌ హిందీ సినిమా చేయబోతున్నాను. ఎక్కడి నుంచైనా మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పుకుండా సినిమా చేస్తాను. ఒక యాక్టర్‌గా గ్లోబల్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అవ్వాలి అనుకుంటాను. సక్సెస్‌ను తలకు, ఫెయిల్యూర్‌ను హార్ట్‌కు చేరనివ్వకూడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతాను’’ అన్నారు విక్రమ్‌. విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘స్కెచ్‌’. తమిళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం చెబుతోంది. త్వరలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విక్రమ్‌ చెప్పిన సంగతలు....

► న్యూ టైప్‌ ఆఫ్‌ హీరోయిజమ్‌తో మాస్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌గా ‘స్కెచ్‌’ చిత్రాన్ని కొత్త స్టైల్లో ట్రై చేశాం. సినిమాలో వచ్చే ట్విస్ట్‌లకు ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. సూపర్‌ క్లైమాక్స్‌ ఇచ్చారు దర్శకులు. తమిళంలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కేరళలో కూడా ‘స్కెచ్‌’ హిట్‌ అయ్యింది. అన్నీ సెంటర్స్‌ ఆడియన్స్‌ లైక్‌ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఈ సినిమాలో కొత్త విక్రమ్‌ని చూస్తారు. ఓన్లీ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఉన్న సినిమాలే కాదు. కమర్షియల్‌ సినిమాలూ ఇష్టమే. అయితే క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ లేకపోతే సినిమాలు చేయను. 

► ప్రస్తుతం నేను గౌతమ్‌వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా త్రీ పార్ట్స్‌ అని కాదు. ఒక ఫ్రాంచైజీలా తీయాలనుకుంటున్నాం. ఇంట్రర్‌నేషనల్‌ స్పై థ్రిల్లర్‌. నెక్ట్స్‌ ‘సామి’ సీక్వెల్‌ చేస్తున్నాను. కమల్‌సార్‌ ప్రొడక్షన్‌లో సినిమా చేయనున్నాను. తర్వాత ‘మహావీర్‌కర్ణ’ చిత్రాన్ని స్టార్ట్‌ చేయనున్నాను. 

► ‘అర్జున్‌ రెడ్డి’ మంచి సినిమా. ఈ సినిమాతో «మా అబ్బాయి ధ్రువ్‌ను లాంచ్‌ చేయాలన్నది నాన్నగారి ఆలోచన. ధ్రువ్‌కి మరో త్రీ ఇయర్స్‌ తర్వాత యాక్టింగ్‌కి కరెక్ట్‌ టైమ్‌ అని నేను అనుకున్నాను. ఒకవేళ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను నా కొడుకు చేయకపోతే.. నేను ట్రై చేసేవాడినేమో. ఏజ్‌ పరంగా నాకు ఏ ప్రాబ్లమ్‌ లేదు. స్క్రీన్‌పై యాక్టర్‌ ఎలా కనిపిస్తున్నారన్నదే ముఖ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement