
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సినీనటుడు సుమన్ స్పందించారు. పాలిటిక్స్‌లో ఇదొక గుణపాఠం అన్నారు. సోమవారం నాడు ఆయన ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడుతూ.. 'చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడూ వస్తాడో తెలుస్తుంది. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలులొనే ఉంటారు.
మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారు. సీఎం వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు జైలుకు వెళ్ళాడంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి. సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment