Vastavikta Pandit Introducing Herself As Shahid Kapoor Wife, Deets Inside - Sakshi
Sakshi News home page

Shahid Kapoor: ఆ స్టార్‌ కిడ్‌ నా వెంట పడుతోంది, చూపుల్తో చంపేస్తోందంటూ పోలీసులను ఆశ్రయించిన హీరో!

Published Thu, Mar 16 2023 11:59 AM | Last Updated on Thu, Mar 16 2023 2:40 PM

Vastavikta Introducing Herself As Shahid Kapoor Wife, Deets Inside - Sakshi

హీరోలను ఇష్టపడటం సహజమే, కొందరైతే అభిమానం హద్దులు దాటి ఆరాధిస్తారు కూడా! కానీ ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు స్టార్స్‌ను ఇబ్బందులపాలు చేస్తుంది. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. అదేంటో తెలుసుకుందాం.. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్‌ చాలామందే ఉన్నారు. 'ఇష్క్‌ విష్క్‌' సినిమాతో చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అతడు తక్కువ కాలంలోనే ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతోమంది మహిళా అభిమానుల గుండె ముక్కలైంది. వారిలో దివంగత నటుడు రాజ్‌ కుమార్‌ కూతురు వాస్తవిక్త కూడా ఒకరు.

ఆమెకు షాహిద్‌ అంటే పిచ్చి ప్రేమ. అతడు కనిపిస్తే చాలు హీరోనే చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంది. షైమక్‌ డావర్‌ డ్యాన్స్‌ క్లాసులో తొలిసారి షాహిద్‌ను నేరుగా చూసింది. తొలిచూపులోనే అతడు తెగ నచ్చేశాడట. తనకు తెలియకుండానే అతడితో ప్రేమలో కూడా పడిందట! కానీ నటుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయేవాడు. ఎంతమందిలో ఉన్నా ఆమె చూపులు మాత్రం షాహిద్‌పైనే ఉండేవట. పైగా తనను షాహిద్‌ భార్యగా కూడా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇది హీరోకు ఇబ్బందికరంగా అనిపించింది. మొదట నచ్చజెప్పి చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదట.  

పైగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవడంతో ఓపిక నశించిన హీరో ఏకంగా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్‌కు రావడం, బయటకు వెళ్తే ఫాలో కావడం, ఏకంగా తన ఇంటి పక్క ఇంట్లోకి షఫ్ట్‌ కావడం.. ఇవన్నీ చిరాకు తెప్పించడంతో 2012లో షాహిద్‌.. వాస్తవిక్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ ఫిర్యాదు తర్వాత ఆమె మరెన్నడూ షాహిద్‌ను ఫాలో కాలేదట. ఇకపోతే వాస్తవిక్త 1996లో యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించింది. తండ్రి రాజ్‌కుమార్‌ అందుకున్న పేరు ప్రతిష్టలు తనకెలాంటి సక్సెస్‌ తెచ్చిపెట్టలేకపోయాయి. ఫలితంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందీ నటి.

చదవండి: అవార్డులే అనుకున్నా ఆస్కార్‌ కూడా కొనేశారు కదరా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement