వైఎస్ జగన్ యాత్రను అడ్డుకుంటే ఊరుకోం | Tour along with obstructs urukom | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ యాత్రను అడ్డుకుంటే ఊరుకోం

Published Wed, Mar 5 2014 4:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Tour along with obstructs urukom


కాజీపేట  తెలంగాణలో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి యాత్రను అడ్డుకుంటే ఊరుకోబోమని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రాజ్‌కుమార్ యాదవ్ అన్నారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల  కోసం తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వాటి వల్ల ఎందరికో లబ్ది చేకూరింద ని, ప్రజలు వైఎస్ కుటుంబం పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. వైఎస్‌ఆర్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి..

తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని, ఆయన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కొంత మంది రాజకీయ నాయకులు లబ్ది కోసం జగన్ యాత్రను అడ్డుకుంటామని అలజడి సృష్టిస్తున్నారని వారికి ప్రజలే బుద్ది చె బుతారని అన్నారు. తెలంగాణలో జగన్ యాత్ర సక్సస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ తాజుద్దీన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement