80 కిలోల వెండి పట్టివేత | 20 kilos silver captured in rajahmundry | Sakshi

80 కిలోల వెండి పట్టివేత

Jul 8 2015 8:16 PM | Updated on Sep 3 2017 5:08 AM

రాజమండ్రి నగరంలో రైల్వే పోలీసులు బుధవారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల వెండిని పట్టుకున్నారు.

రాజమండ్రి (తూర్పుగోదావరి): రాజమండ్రి నగరంలో రైల్వే పోలీసులు బుధవారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల వెండిని పట్టుకున్నారు. విశాఖ నగరానికి చెందిన రాజ్‌కుమార్, సుందరమూర్తి, వాసు అనే వారు షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి తమిళనాడులోని సేలం నగరానికి 80 కిలోల వెండి తీసుకుని వెళ్తున్నారు.

రైల్వే డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురినీ ప్రశ్నించగా వారి వద్ద రూ.20 లక్షల విలువైన వెండి కనిపించింది. తగిన పత్రాలు లేకపోవటంతో వెండిని స్వాధీనం చేసుకుని ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement