వనస్థలిపురం పరిధిలోని ద్వారకామయినగర్ కాలనీలో నాలుగు రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన అర్చన కేసు మిస్టరీ వీడింది.
వనస్థలిపురం పరిధిలోని ద్వారకామయినగర్ కాలనీలో నాలుగు రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన అర్చన కేసు మిస్టరీ వీడింది. బండ్లగూడకు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజ్‌కుమార్‌కు సహకరించిన రాములు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం, డబ్బులు కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు మృతురాలు అర్చనకి మధ్య వివాహేతరం సంబంధం ఉండటం వల్లన గతంలో కూడా అర్చన వద్ద ఫైనాన్స్ తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు చెల్లించమని అడిగేసరికి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితులు తెలిపారు.