నాపై అభిప్రాయం మారింది : రాజ్‌కుమార్
Published Mon, Oct 7 2013 12:06 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: లవ్, సెక్స్ ఔర్ ధోకా సినిమాలతో బాలీవుడ్‌లోకి అడుగిడిన నటుడు రాజ్‌కుమార్...ఆ తర్వాత రాగిణి ఎంఎంఎస్, సైతాన్ వంటి చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఏదిఏమైనప్పటికీ కాయ్ పో చే సినిమా సక్సెస్ తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందన్నాడు. చేతన్ భాగత్ నవల ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ ఆధారంగా కాయ్ పో చే సినిమా రూపొందిందన్నాడు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతంలో తాను నటించిన సినిమాల కంటే కచ్చితంగా ఎంతో గుర్తింపు తెచ్చిందన్నాడు.
ఈ సినిమాతో పరిశ్రమలో నాపై అభిప్రాయం కచ్చితంగా మారిపోయిందన్నాడు. వాణిజ్యపరంగా ఈ సినిమా విజయవంతమవడం నాతో సినిమాలు చేసేందుకు అనేకమంది నిర్మాతలు ముందుకు రావడానికి దోహదపడిందన్నాడు. పోస్టర్లపైనే కాకుండా అన్నిచోట్లా తానే ఉండేవిధంగా చేసిందన్నాడు. తానంటే ఏమిటో అందరికీ తెలిసేవిధంగా చేసిందన్నాడు. ఇప్పుడు సినిమాలను ఎంపిక చేసుకునే స్థాయికి చేరుకున్నానన్నాడు. కథ నచ్చకపోతే అడుగు ముందుకేయనన్నాడు. ఏదిఏమైనప్పటికీ కాయ్ పో చే సినిమా విజయవంతమయినప్పటికీ నటుడిగా తన పనితీరులో ఎటువంటి మార్పు లేదన్నాడు.
పాత్ర, స్క్రిప్టులను ఆధారంగా చేసుకుని ఎటువంటి సినిమాలోనైనా నటించేందుకు తాను అన్నివేళలా సిద్ధమేనన్నాడు. తనకు అంతా సమానమేనన్నాడు. సోలో హీరో పాత్రలే కాకుండా మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. పాత్ర ఏదైనా ఇబ్బందేమీ లేదన్నాడు. అయితే పోషించే పాత్ర మాత్రం కచ్చితంగా ఉత్తేజం కలిగించేదిగా ఉండాలన్నాడు. కాగా దర్శకుడు హన్సల్ మెహతా సారథ్యంలో తీయనున్న షాహిద్ సినిమాలో రాజ్‌కుమార్ నటించనున్నాడు. 2010లో ముంబైలో హత్యకు గురైన మానవహక్కుల కార్యకర్త షాహిద్ అజ్మి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
Advertisement
Advertisement