ట్రాక్టర్ ట్రాలీ మీద పడి బాలుడు దుర్మరణం | Boy dies to Tractor tralley hitting | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ట్రాలీ మీద పడి బాలుడు దుర్మరణం

Published Tue, Sep 8 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

Boy dies to Tractor tralley hitting

మంథని: కరీంనగర్ జిల్లా మంథని పట్టణంలోని ఎరుకలగూడెంలో మంగళవారం రాత్రి విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ డోర్ మీద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఆకుల శ్రీనివాస్, శిరీష దంపతుల కుమారుడు ఆకెళ్ల రాజ్ కుమార్ (6) యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి ముందు ఓ ట్రాక్టర్ ఆగి ఉండడంతో రాజ్ కుమార్ ఆడుకుంటున్నాడు.

ట్రాక్టర్ ట్రాలీ వెనుక డోర్ పట్టుకుని వేలాడుతుండగా ఒక్కసారిగా ఆ డోర్ వచ్చి అతడి చాతీ భాగానికి తగిలింది. దాంతో రాజ్‌కుమార్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీనివాస్ దంపతులకు రాజ్‌కుమార్‌తోపాటు ఓ బేబీ కూడా ఉంది,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement