కన్నీరు పెట్టిస్తున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ పెయింటింగ్‌.. | Puneeth Rajkumar And His Father Rajkumar Painting Goes Viral | Sakshi
Sakshi News home page

Punneth Rajkumar: కన్నీరు పెట్టిస్తున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ పెయింటింగ్‌..

Published Sat, Nov 6 2021 1:46 PM | Last Updated on Sat, Nov 6 2021 4:33 PM

Puneeth Rajkumar And His Father Rajkumar Painting Goes Viral - Sakshi

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి వారం రోజులు గడుతున్నా ఇప్పటికి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని దర్శించుకు రోజు వందల్లో అభిమానులు తరలివస్తున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే అప్పు అక‌స్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తీవ్రం కలచివేస్తోంది. ఆయ‌నను త‌ల‌చుకుంటూ క‌న్నీరుపెట్టుకుంటున్నారు. చూస్తుంటే దీని నుంచి కన్నడ పరిశ్రమ కానీ, అభిమానులు కానీ ఇప్పడే బయట పడేలా కనిపించడం లేదు.

చదవండి: పునీత్‌ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో

ఆయన మరణ వార్త ఒక్క శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు భారత సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పునీత్‌ అభిమాని వేసిన ఓ పెయింటింగ్‌ ప్రతి ఒక్కరిని హత్తుకుంటోంది. క‌ర‌ణ్ ఆచార్య‌ అనే ఓ వ్యక్తి గీసిన‌ ఈ పెయింటింగ్‌లో పునీత్ తండ్రి, క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ స్వ‌ర్గంలో కూర్చొని ఉండ‌గా.. ఆయన వెన‌క నుంచి వెళ్లిన పునీత్ క‌ళ్లు మూసి తండ్రిని స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ చిత్రం చూడగానే అందరి కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లుతున్నాయి. ఇందులో వారిద్దరిని చూసి అభిమానులంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ చిత్రంపై తమదైన శైలిలో స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. 

చదవండి: పునీత్‌ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌, ఇవే అప్పు చివరి క్షణాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement