యువ రాజ్‌కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్‌' చిచ్చు | Yuva Rajkumar Files Divorce Petition With Wife Sridevi Byrappa After 5 Years Of Marriage | Sakshi
Sakshi News home page

యువ రాజ్‌కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్‌' చిచ్చు

Published Tue, Jun 11 2024 9:22 AM | Last Updated on Tue, Jun 11 2024 11:00 AM

Yuva Rajkumat Divorce Sent His Wife Sridevi

కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో   విడాకుల పిటిషన్‌ దాఖలు చేశాడు. తనను క్రూరంగా శ్రీదేవి హింసిస్తుందంటూ అందులో పేర్కొన్నాడు. దానిని ఖండించిన శ్రీదేవి కూడా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.  తన భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిపై శ్రీదేవి భైరప్ప కూడా కౌంటర్ ఇచ్చింది. యువ రాజ్‌కుమార్‌కు అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి సంచలన ఆరోపణ చేసింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

అది గమనించిన శ్రీదేవి భైరప్ప.. ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.  దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే.

న్యాయవాది చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి..?
'శ్రీదేవికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇంటి పేరు దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తితో  శ్రీదేవికి  ఎఫైర్ ఉంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ నటితో యువ రాజ్‌కుమార్‌కు సంబంధం ఉందంటూ తప్పుడు కథనం చెబుతుంది. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్య ఉందని నా లీగల్‌ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చింది. లైంగిక సమస్య ఉంటే అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది..?' అని ప్రెస్‌మీట్‌లో న్యాయవాది ప్రశ్నించారు.

ఆయనకు ఒక నటితో ఎఫైర్‌ ఉంది: శ్రీదేవి భైరప్ప 
'వృత్తిపరమైన సమగ్రతను కాపాడుకోవాల్సిన వ్యక్తి బహిరంగంగా ఒక మహిళ పాత్రపై తక్కువ స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది. గత కొన్ని నెలలుగా నేను ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది.  నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.' అని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు.

యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓమ్‌ చిత్రంలో మెప్పించాడు. ఈ ఏడాదిలోనే 'యువ' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్‌ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. నివేదిక ప్రకారం, శ్రీదేవి మొదట్లో డాక్టర్ రాజ్‌కుమార్ సివిల్ సర్వీస్ అకాడమీని చూసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత చదువులు చదువుతోంది. జూలై 4 విడాకుల విషయం కోర్టులో విచారణ జరగనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement