కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్‌కె ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్‌లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్‌కు కూడా కారు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్‌కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్‌ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది.
2019లో మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు పునీత్. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని తన భార్యకి గిఫ్ట్‌గా పునీత్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment