
యువరాజ్‌తో శ్రీదేవి
యశవంతపుర: కన్నడ కంఠీరవుడు, దివంగత రాజ్‌కుమార్ ఇంటిలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్ వివాహం మైసూరుకు చెందిన శ్రీదేవితో ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో వైభవంగా జరిగింది. వివాహానికి సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శనివారం రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఇంటిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెప్షన్‌లో తమిళ, తెలుగు, హిందీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment