
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రమైన చాట్రాయిలో చోటుచేసుకుంది. వివరాలు.. టెన్త్ క్లాస్‌లో 10/10 జీపీఏ సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవండంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ సీటు విషయమైన నిన్న రాత్రి మంజు తీవ్ర ఆవేదనతో మాట్లాడిందని ఆమె తల్లి భోరున విలపించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.