నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ట్రిపుల్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో డెరైక్టర్ ఆచార్య వీరంకివెంకటదాసు, పరిపాలనాధికారి ఆచార్య పి.అప్పలనాయుడు 2015-16 విద్యాసంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. 2015-16 సంవత్సరం బ్యాచ్ ఫలితాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఫలితాలు గతం కంటే మెరుగవ్వడం విశేషం!. పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం వరకు మొత్తం ఆరు సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాలు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఈనెల 16నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు.