హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) నిర్మాణం కోసం ప్రభుత్వం కర్నూలు జిల్లాలో 151.51 ఎకరాలు కేటాయించింది. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడులో ట్రిపుల్ ఐటీ కోసం 151.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.