వేంపల్లె (కడప) : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని ఆర్‌జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని వస్తున్న అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు.
అలా చేస్తే పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని, అందువల్ల ఎంపిక విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రిపుల్ ఐటీలో ఎంపిక విధానాన్ని మార్చలేం
Published Mon, Aug 15 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
Advertisement