కొంచెం ఖేదం.. కొంచెం మోదం.. | Institute of Technology iiit | Sakshi
Sakshi News home page

కొంచెం ఖేదం.. కొంచెం మోదం..

Published Wed, Apr 9 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

Institute of Technology iiit

జేఈఈ-మెయిన్..నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), 
 ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, 
 ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే 
 పరీక్ష.. సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆఫ్‌లైన్ 
 (పేపర్-పెన్ బేస్డ్), ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్) రెండు విధాలుగా ఈ 
 పరీక్షను నిర్వహిస్తుంది.. ఈ క్రమంలో ఆఫ్‌లైన్ పరీక్ష ఈ నెల 6న 
 జరిగింది.. దేశవ్యాప్తంగా దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు 
 రాసిన ఈ పరీక్షకు మన రాష్ట్రం నుంచి  1,07,046 మంది 
 విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో జరిగిన 
 జేఈఈ-మెయిన్ పరీక్ష తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? 
 ఏయే అంశాలకు ఎక్కువ వెయిటేజీ లభించింది? కటాఫ్ ఎంత 
 ఉండొచ్చు? తదితర అంశాలపై సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ..
 
 జేఈఈ-మెయిన్‌ను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో నిర్వహించారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం మార్కులు 360. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నాయి. సరైన సమాధానానికి 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1 మార్కు కోత విధిస్తారు. ఈ సారి అసెర్షన్ -రీజన్ తరహా ప్రశ్నలు అడగలేదు. అన్నీ సింగిల్ కరెక్ట్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే. గతంతో పోల్చితే ప్రశ్నల సరళి కూడా మారింది. ఒక్కో ప్రశ్నకు జవాబులుగా పేర్కొనే నాలుగు ఆప్షన్లను ఒక్కో సిరీస్ ప్రశ్నపత్రంలో ఒక్కో రకంగా ఇచ్చారు.
 
 కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. మిగిలిన ప్రశ్నల్లో 8 మధ్యస్తంగా ఉంటే.. 4 మాత్రం క్లిష్టమైనవి.
కెమిస్ట్రీ.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనే మూడు విభాగాలుగా ఉంటుంది. ఈ క్రమంలో విభాగాల వారీగా వచ్చిన ప్రశ్నల శాతాన్ని పరిశీలిస్తే..
  ఫిజికల్ కెమిస్ట్రీ: 40 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం,
  ఇనార్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం.
అధిక శాతం ప్రశ్నలు నిర్దేశించిన సిలబస్ మేరకు ఉండడమే కాకుండా టెక్ట్స్ పుస్తకాల నుంచి నేరుగా ఇవ్వడం జరిగింది. 
తరగతుల వారీగా ప్రశ్నల విభజనను చూస్తే..11వ తరగతి నుంచి దాదాపుగా 11 ప్రశ్నలు, 12వ తరగతి నుంచి దాదాపుగా 16 ప్రశ్నలు వచ్చాయి.రెండు ప్రశ్నలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటి క్లిష్టత స్థాయి కూడా ఇంటర్మీడియెట్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
 
మొత్తంగా పరిశీలిస్తే కెమిస్ట్రీ పేపర్ సులభంగానే అనిపి స్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్లు రెండు ఒకే విధంగా ఉండడం కారణంగా వాటిని సాధించడానికి సహేతుకమైన ఆలోచన అవసరం. కానీ చాలామంది విద్యార్థులు పేపర్ సులభంగానే  ఉందనే ఉద్దేశంతో అన్ని ప్రశ్నలను యత్నించారు. దాంతో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి ఫలితాల్లో కెమిస్ట్రీ నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ చాప్టర్ల నుంచి 
 
 (నాలుగు చొప్పున) ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు ప్రాథమిక అంశాలపైన ఉన్నాయి. వీటిని టెక్ట్స్‌బుక్స్ నుంచి నేరుగా అడగటం జరిగింది.
ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రశ్నల క్లిష్టత కూడా ఎక్కువగా ఉంది. 
 
  70-80 105
  యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్
 -టి.కృష్ణ, (ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్)
 
 ఫిజిక్స్
 ఫిజిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నలు ఇచ్చారు. 
ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాల 
 సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు.
మొదటి సంవత్సరంలో మెకానిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి.
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 16 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 14 ప్రశ్నలు ఇచ్చారు.
మొదటి సంవత్సరం నుంచి టాపిక్‌ల వారీగా వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే: మెకానిక్స్-5 ప్రశ్నలు; ఫ్లూయిడ్  మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ -3 ప్రశ్నలు; సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్-2 ప్రశ్నలు; థర్మోడైనమిక్స్-3 ప్రశ్నలు; యూనిట్ డెమైన్షన్స్, ఎర్రర్ మెజర్‌మెంట్స్-2 ప్రశ్నలు; గ్రావిటేషన్-1 ప్రశ్న.
 
ద్వితీయ సంవత్సరం నుంచి టాపిక్‌ల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం-6 ప్రశ్నలు; జియోమెట్రికల్ అండ్ వేవ్ టాపిక్స్, ఈఎం వేవ్స్-5 ప్రశ్నలు; మోడ్రన్ ఫిజిక్స్-2 ప్రశ్నలు; సెమీకండక్టర్ డివెజైస్-1 ప్రశ్న. మొత్తం మీద చూస్తే ఫిజిక్స్ క్లిష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే..కొన్ని ప్రశ్నలు సమస్యాధారితంగా (ప్రాబ్లమ్ బేస్డ్) ఉన్నాయి. కొన్ని ప్రశ్నలను సాధించడానికి సుదీర్ఘమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది.పశ్నలను సాధించే పద్ధతిపై అవగాహన ఉన్నప్పటికీ.. సుదీర్ఘ కాలిక్యులేషన్స్ కారణంగా అధిక శాతం సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.రెండు, మూడు కాన్సెప్ట్‌లు కలిపి మల్టిపుల్ కాన్సెప్ట్‌లుగా ఇచ్చిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది.సాధారణంగా విద్యార్థులు నిర్లక్ష్యం చేసే సర్ఫేస్ టెన్షన్, ఎలాస్ట్టిసిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ వంటి అంశాలకు ఈ సారి ప్రాధాన్యత లభించింది. పధాన చాప్టర్లుగా భావించే ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన ప్రశ్నలు స్వల్పంగానే ఉన్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థులు అన్ని టాపిక్‌లకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది.
 
  50 80-90
  యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్
  -రామకృష్ణ,
 (ఆర్ కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్)
 
 మ్యాథమెటిక్స్
  గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మ్యాథమెటిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు.
ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాలకు సమ ప్రాధాన్యత లభించింది.
ఇంటర్మీడియెట్‌లో సబ్జెక్ట్‌పై మంచి అవగాహన ఉన్న విద్యార్థి సులభంగా 18 ప్రశ్నలను సాధించగలడు.
అసెర్షన్-రీజన్ టైప్ ప్రశ్నలు లేని కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చారని చెప్పొచ్చు.
మొత్తం 30 ప్రశ్నల్లో.. సులభమైనవి-10, సుదీర్ఘ ప్రశ్నలు-7, కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు-8, క్లిష్టమైనవి-5.
గత ప్రశ్నపత్రాల నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి.
 
నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రత్యేకంగా 4 ప్రశ్నలు ఇచ్చారు.
కాలిక్యులస్ నుంచి వచ్చిన 7 ప్రశ్నల్లో 4 సులభమైనవి.
ఆల్జీబ్రా నుంచి అడిగిన 10 ప్రశ్నల్లో 6 సులభమైనవి.
కోఆర్డినేట్ జ్యామెట్రీ నుంచి వచ్చిన 5 ప్రశ్నల్లో 3 సులభమైనవి. 
       మెట్రీలో రెండు ప్రశ్నలు మాత్రమే సులభంగా ఉన్నాయి.
మీన్ వాల్యూ, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, డీఆర్‌ఎస్-డీసీఎస్, ప్రొబబిలిటీ, స్ట్రైట్ లైన్, మ్యాట్రిక్స్, సెట్స్ నుంచి అడిగిన ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్‌గా డెరైక్ట్‌గా ఉన్నాయి. వీటిని సాధించడం సులభం.మిక్స్‌డ్ కాన్సెప్ట్ ప్రశ్నలు (ఇన్వర్స్+డిఫరెన్షియెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్+ఇంటీజర్), బైనామిల్ థీరమ్‌పై వచ్చిన ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా సుదీర్ఘమైనవి. మిగతా చాప్టర్ల నుంచి అడిగిన ప్రశ్నలు ఒక మోస్తరుగా ఉన్నాయి. 
 
  60-70 115-120
  యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్
 
 -ఎం.ఎన్.రావు,(శ్రీ చైతన్య విద్యా సంస్థలు, హైదరాబాద్), 
 బి.వాసు, (డాక్టర్ ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్).
 310 బెస్ట్ మార్‌‌క పైనే ఉండొచ్చు
 ఫలితాల వెల్లడి: మే 3, 2014
 వెబ్‌సైట్: http://jeemain.nic.in
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement