
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీని ప్రవేశపెడతామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చెప్పారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం టీ హబ్ భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ పాలసీ ముసాయిదా తయారు చేశామని, జూన్ రెండులోపు మొదటి దశ తెలంగాణ హబ్ పనులు పూర్తవుతాయని చెప్పారు.
మొదటిదశలో నాలుగు వందల కంపెనీలలో మూడు వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. 2018లో జరిగే ఐటీ కాంగ్రెస్ నాటికి ఐటీ హబ్ రెండో దశ పనులు పూర్తిచేస్తామన్నారు. రెండో దశలో సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.