జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు | National Institutions to set up in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు

Published Tue, Apr 29 2014 1:42 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

National Institutions to set up in Andhra Pradesh

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్న కేంద్రప్రభుత్వం అందుకు చర్యలు ప్రారంభించింది. వీటికి అవసరమయ్యే స్థలాల సేకరణకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా శాఖకు లేఖ రాసింది.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్ర ట్రిపుల్ ఐటీల ఏర్పాటు విషయమై పలు సూచనలు చేసింది. రోడ్డు, రైలు, ఆకాశయాన మార్గాలకు అనుగుణంగా ఈ స్థలాల ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఐఐటీకి 300 ఎకరాలు, ఎన్‌ఐటీకి 300 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్‌కు 200 ఎకరాల చొప్పున స్థలం అవసరమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement