హైదరాబాద్: రాయలసీమలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్టు కేఈ వెల్లడించారు. రెవెన్యూ శాఖలో పనులు చాలా జాప్యంగా జరుగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే శాఖల మధ్య సమన్వయానికి సలహాలు కమిటీ సలహాలు ఇస్తుందని చెప్పారు. రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తే అధికారులకు ఫైన్ వేస్తామని కేఈ తెలిపారు.