సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి.
జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది.
అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment