CET exam
-
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు..అంతా సెట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి (2022–23) సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయబోతున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కసరత్తు చేపట్టింది. అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో మౌఖికంగా సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలిసింది. జనవరి 15లోగా వీసీలతో ఉత్తర ప్రత్యుత్తరాల ప్రక్రియను పూర్తి చేసి నెలాఖరు కల్లా షెడ్యూల్‌ను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి అన్ని సెట్స్ కూడా సకాలంలో నిర్వహించే వీలుందని విద్యా మండలి ధీమా వ్యక్తం చేస్తోంది. వర్సిటీలకు జనవరిలో లేఖలు.. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఏటా ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్), ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఎడ్‌సెట్, లాసెట్ ప్రధానంగా నిర్వహిస్తుంటారు. ఈసారి ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ఉమ్మడి పరీక్షల కేలండర్‌ను ప్రకటించాలి. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షల్లో జాప్యం జరిగింది. ఎంసెట్ ప్రక్రియ డిసెంబర్ మూడో వారం వరకూ సాగింది. ఎడ్‌సెట్, లాసెట్ సీట్ల కేటాయింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో కొత్త కేలండర్ విషయంలో ఉన్నతాధికారులు తర్జన భర్జన పడ్డారు. ఇటీవలి సమావేశంలో దీనిపై చర్చించి వీసీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఏ సెట్‌ను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి, ఎవరిని సెట్ కన్వీనర్‌గా నియమించాలో కసరత్తు మొదలైంది. జనవరి మొదటి వారంలో విశ్వవిద్యాలయాల వీసీలకు లేఖ రాయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రతి వర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి ఆ వర్సిటీకి కేటాయించిన సెట్ నిర్వహణకు కన్వీనర్‌ను ఎంపిక చేస్తారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి ఉన్నత విద్యా మండలి ప్రధానంగా ఎంసెట్‌పై దృష్టి పెడుతోంది. పరీక్ష సకాలంలో నిర్వహించినా కౌన్సెలింగ్ విషయంలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఈ ఏడాది ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో సీట్లు పెద్దగా మిగిలిపోకుండా కాపాడగలిగారు. వచ్చే ఏడాదీ ఇదే తరహాలో సెట్ నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. అలాగే డిమాండ్ లేని కోర్సులు, విద్యార్థులు చేరని కాలేజీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వీటిని పరిగణనలోనికి తీసుకున్నాకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా వర్గాలు ఆలోచిస్తున్నాయి. అనుకున్న సమయానికే పరీక్షలు వీలైనంత వరకు అనుకున్న సమయానికే వచ్చే ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. త్వరలోనే వీసీలకు అధికారికంగా లేఖలు రాస్తాం. జవాబు వచ్చాక ఏ వర్సిటీకి ఏ సెట్ నిర్వహణ ఇవ్వాలో నిర్ణయిస్తాం. ఈ ప్రక్రియ జనవరిలోనే పూర్తి చేసి షెడ్యూల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
‘ఎంసెట్’ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2021 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. షెడ్యూలు ప్రకారం ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గడువును పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. -
సెట్లన్నీ వాయిదాయేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్, జూలైలో ఈ పరీక్షలనిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్ఏప్రిల్, మే నెలల పరీక్షలు వాయిదా పడగా, వాటి ప్రభావం రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షలైన (సెట్స్) ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలపైనా పడే పరిస్థితి నెలకొంది. జేఈఈ మెయిన్ వాయిదా.. ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు రెండు వాయిదా పడ్డాయి. 2021–22 విద్యా సంవత్సరం కోసం జేఈఈ మెయిన్‌ను కరోనా కారణంగా నాలుగు దఫాలుగా నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గత డిసెంబర్లోనే ప్రకటించింది. అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో దఫా పరీక్షలను నిర్వహించింది. ఇక ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సి మూడో దఫా పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రకటించింది. ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన నాలుగో విడత పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది విద్యార్థులకు 15 రోజుల ముందుగా తెలియజేస్తామని ప్రకటించింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడితేనే జూన్‌లో (వచ్చే నెలలో) ఆ రెండు జేఈఈ మెయిన్లను నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే జూలైలో నిర్వహించాల్సి వస్తుంది. అదే జరిగితే ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ కూడా వాయిదా వేయకతప్పదని అధికారులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పరీక్షలూ వాయిదా? జాతీయ స్థాయి పరీక్షల ప్రభావం రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలపైనా పడనుండటంతో అవి కూడా వాయిదా పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతే జూన్ 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్‌ను వాయిదా వేయాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జూలై 1వ తేదీన నిర్వహించాల్సిన ఈసెట్, జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎంసెట్ కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ను జూలైలో నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు జూలై 5వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎంసెట్ నిర్వహణలో ఆలస్యం తప్పేలా లేదు. ఇక ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షలు ఆగస్టులో ఉన్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కరోనా కేసులు ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంనాటికైనా తగ్గుముఖం పట్టి, పరిస్థితి అదుపులోకి వస్తే మాత్రం పరీక్షలను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించే వీలు ఉంటుందని, అయితే అది సాధ్యం అవుతుందో లేదోనన్న అనుమానాలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టీఎస్ఆర్జేసీ సెట్ వాయిదా తెలంగాణ గురుకులాల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన టీఎస్ఆర్జేసీ సెట్‌ను వాయిదా వేసినట్లు గురుకులాల సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 31వ తేదీ వరకు పొడగించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. -
Engineering Academic Calendar: ఈ షెడ్యూలు అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 2021–22 విద్యా సంవత్సరానికి అకడమిక్ కేలండర్‌ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసింది. కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల జారీ తేదీలు, ప్రవేశాలు పూర్తి చేయాల్సిన గడువు, తరగతుల ప్రారంభం వంటి అన్ని అంశాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 9 నాటికి ప్రవేశాలను పూర్తి చేసి, 15వ తేదీ నాటికల్లా ప్రథమ సంవత్సర విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రథమ సంవత్సరం మినహా ఇతర సంవత్సరాల వారికి మాత్రం సెప్టెంబర్ 1 నుంచే తరగతులను ప్రారంభించాలని వెల్లడించింది. మరోవైపు పీజీడీఎం/పీజీసీఎం కోర్సుల్లో జూలై 1 నుంచే తరగతులను ప్రారంభించాలని, జూలై 10లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది. షెడ్యూలు ప్రకారం జరిగేనా? దేశవ్యాప్తంగా కరోనా కారణంగా గతేడాది అక్టోబర్ లో తరగతుల బోధనను ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ఓవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను, ఈనెలలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా అదుపులోకి వస్తే తప్ప వాటిని నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రాల వారీ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెట్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఐసీటీఈ జారీ చేసిన అకడమిక్ కేలండర్ అమలు అవుతుందా లేదా? అన్నది అనుమానమే. గతేడాది కూడా సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా అకడమిక్ కేలండర్‌ను జారీ చేసినా తరువాత దాన్ని పలుమార్లు మార్పు చేయాల్సి వచ్చింది. కరోనా వల్ల చివరకు అక్టోబర్‌లో ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఈసారి కూడా కరోనా కేసులు అదుపులోకి రాకపోతే అదే పరిస్థితి ఉంటుందని అధ్యాపక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంకా పూర్తికాని బోధన.. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విద్యే కొనసాగుతోంది. ఇంకా తరగతులు పూర్తి కాలేదు. వచ్చే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా వారికి పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచే ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే వారికి ఏఐసీటీఈ నిర్దేశిత సమయంలో బోధనను ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అధ్యాపక సంఘాల నేతలు అయినేని సంతోష్‌కుమార్, బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండానే అకడమిక్ కేలండర్‌ను జారీ చేసిందని ఆరోపించారు. ఈనెలలో పరీక్షలు వద్దు: యూజీసీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలలో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రస్తుతానికి నిలిపివేయాలని యూజీసీ పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ పరీక్షల విషయంలో కేంద్రం, తాము జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానమని, ఈ పరిస్థితుల్లో మే నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను నిలిపేయాలని స్పష్టం చేసింది. ఇదీ ఇంజనీరింగ్, ఫార్మసీ అకడమిక్ కేలండర్.. 30–6–2021: సాంకేతిక విద్యా సంస్థలకు అనుమతులకు చివరి గడువు 15–7–2021: యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు పూర్తికి చివరి తేదీ 31–8–2021: మొదటి దశ కౌన్సెలింగ్, సీట్లు కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 1–9–2021: ప్రథమ సంవత్సరం మినహా మిగతా వారికి తరగతులు ప్రారంభం. 9–9–2021: రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 10–9–2021నాటికి: సీట్లు రద్దు చేసుకున్న వారికి పూర్తి ఫీజు తిరిగి ఇచ్చేయాలి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో మిగిలిన ఖాళీల్లో విద్యార్థుల చేరికలు పూర్తి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో చేరిన వారికి తరగతుల ప్రారంభానికి చివరి గడువు 20–9–2021: ద్వితీయ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పూర్తి -
సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలైలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లలో ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా పరీక్షల సమయాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు, కుర్చీలు, బెంచీలు కెమికల్‌తో శుభ్రపరిచేందుకు, ఆన్లైన్ పరీక్షలు అయినందున కంప్యూటర్, కీ బోర్డు, మౌస్ వంటివి శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో కొన్ని ఒకే సెషన్‌తో ముగియనుండగా, మరికొన్ని ఎక్కువ సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ పరీక్షను తీసుకుంటే 6 సెషన్లలో (ప్రతిరోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్) మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే అగ్రికల్చర్ పరీక్షలను రెండు, మూడు సెషన్లలో, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి వాటికి రెండేసి చొప్పున సెషన్లలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక సెషన్‌కు మరో సెషన్ మధ్య 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడుతాజాగా పరీక్షల తేదీలను మార్పు చేసిన నేపథ్యంలో 3 గంటల వ్యవధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యల కోసం మధ్యలో 3 గంటల సమయం ఉండేలా ఉదయం సెషన్ పరీక్షల సమయాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
నో బయోమెట్రిక్.. ఓన్లీ హాల్‌టికెట్!!
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ఉమ్మడి ప్రవే శ పరీక్షల్లో(సెట్స్) బయోమెట్రిక్ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్ (థంబ్ ఇంప్రెషన్) విధానాన్ని తొలగించాల ని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరి కైనా కరోనా ఉంటే థంబ్ ఇంప్రెషన్(వేలి ముద్రల సేకరణ)తో వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున ఈసారి థంబ్ ఇంప్రెషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థుల హాల్‌టికెట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఒకరికి బదులు మరొక రు పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌ను రద్దు చేస్తున్నందున హాల్‌టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించనుంది. జాతీయ స్థాయిలోనూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు బయోమెట్రిక్ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్, ఆగస్టులో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ బయోమెట్రిక్ లేకుండానే పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో హాల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండే మానిటర్‌పై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యార్థి ఫొటోను ఆటోమెటిక్‌గా తీస్తాయి. -
ఈనెల 20న ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ సమావేశాలు బుధవారం నుం చి మొదలు కానున్నాయి. ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్‌కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, 17న ఎడ్‌సెట్, 19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్య లు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని ఈనెల 15న లేదా 18న నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్ కమిటీ స మావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వా త లాసెట్ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆ యా సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 20 లేదా 21న జారీ చేసే అవకాశం ఉంది. మార్చి 2న పాలిసెట్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2020 నోటిఫికేషన్‌ను మార్చి 2వ తేదీన జారీ చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. ఇందులో పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనుంది. -
మేలో ‘సెట్’ల పండుగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌లో) ప్రవేశాల కోసం 2020 మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్ పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను బట్టి సెషన్స్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. నిమిషం నిబంధన యథాతథం.. ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి నేషనల్ పూల్ లేదు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్ట సవరణతోనే విదేశీ వర్సిటీలు ప్రస్తుతం ఉన్న పార్లమెంటు చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలు దేశంలో యూనివర్సిటీ లేదా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న నూతన విద్యా విధానంలో ఆ అంశంపై చర్చిస్తోందని, అందులో ఓకే చెబితే విదేశీ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా సెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి. -
ఏపీఆర్‌సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఎంఫిల్ ప్రవేశాల కోసం ఏపీఆర్‌సెట్ షెడ్యూలును ఆర్‌సెట్ కన్వీనర్ శ్రీనివాసరావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నెల 16 నుంచి అక్టోబరు 10 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండు వేల రూపాయల పరిహారంతో అక్టోబరు 16 వరకు గడువుంది. అక్టోబరు 28 నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 68 సబ్జెక్టులలో నవంబర్ 8 నుంచి 12 వరకు జరిగే పరీక్షలను విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్‌లలో నిర్వహించనున్నారు. -
ఆ కోర్సులు మాకొద్దు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. విద్యా బోధనలో నాణ్యత కొరవడటం.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లకు గతేడాది 4,56,990 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 4,00,953 మందే దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే గతేడాదితో పొలిస్తే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 56 వేలు తగ్గింది. ఎడ్‌సెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు ఎడ్‌సెట్ దరఖాస్తులు గతేడాది కంటే 40 శాతం తగ్గాయి. 2017లో 64,029 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 38,414 మందే పరీక్షకు హాజరవనున్నారు. ఐసెట్ రాసేందుకు గతేడాది 77,422 మంది.. ఈ సారి 62,631 మంది ఆసక్తి చూపారు. ఎంటెక్, న్యాయ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకూ ఆదరణ తగ్గుతోంది. అలాగే ఎంటెక్ కోసం ప్రవేశ పరీక్ష రాసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 12,668 తగ్గింది. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 79,033 మంది.. ఈ సారి 73,106 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీటెక్‌పై డిప్లొమా విద్యార్థుల్లో ఆసక్తి పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ సారి 2,788 మంది ఎక్కువగా ఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ ద్వారా బీటెక్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కూడా సంఖ్య పెరిగింది. గతేడాది 1,41,137 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 1,47,958 మంది పరీక్ష రాయనున్నారు. మార్పులతోనే తగ్గుదల గతంలో డిగ్రీల కోసం ఏదో ఓ కాలేజీలో చేరడం.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతోనే ఆదరణ తగ్గుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా నిబంధనలు కఠినం చేయడంతో చదువుకోవాలన్న శ్రద్ధ ఉన్న విద్యార్థులే కాలేజీల్లో చేరుతున్నారని చెబుతున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలూ సంఖ్య తగ్గడానిక మరో కారణమని పేర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గినందునే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల ఆలోచన ల్లోనూ మార్పొచ్చింది. అనవసరంగా ఫీజులు చెల్లించి చదువలేకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. పైగా నాణ్యత లేకుండా చదివినా ప్రయోజనం ఉండదని, ఉపాధి లభించదని అవగాహనకొచ్చారు. అందుకే సీరియస్‌గా చదువుకోవాలనుకునే వారే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతు న్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ వారు అర్హులు కాదని, ఎస్జీటీ వారే అర్హులని ఎన్సీటీఈ ఉత్తర్వులు ఇవ్వడం.. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
మార్చి 4న టీఎస్, ఏపీ సెట్ కీ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడిగా ఫిబ్రవరి 15న నిర్వహించిన సెట్ పరీక్షకు సంబంధించిన ‘కీ’ ని మార్చి 4 న విడుదల చేయనున్నట్లు సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి శనివారం తెలిపారు. మార్చి 4 నుంచి 13 వరకు పది రోజుల పాటు www.settsap.org లో కీ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.