ఏపీఆర్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల | APRset Schedule Release | Sakshi
Sakshi News home page

ఏపీఆర్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

Published Tue, Sep 10 2019 12:51 PM | Last Updated on Tue, Sep 10 2019 12:59 PM

APRset Schedule Release - Sakshi

సాక్షి, విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ప్రవేశాల కోసం ఏపీఆర్‌సెట్‌ షెడ్యూలును ఆర్‌సెట్‌ కన్వీనర్ శ్రీనివాసరావు‌, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఈ నెల 16 నుంచి అక్టోబరు 10 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రెండు వేల రూపాయల పరిహారంతో అక్టోబరు 16 వరకు గడువుంది. అక్టోబరు 28 నుంచి హాల్‌ టిక్కెట్ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 68 సబ్జెక్టులలో నవంబర్‌ 8 నుంచి 12 వరకు జరిగే పరీక్షలను విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్‌లలో నిర్వహించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement