నూజివీడు(ఏలూరు): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం 38,100 దరఖాస్తులు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పేర్కొన్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా మరో 100 సీట్లు కలిపి 1100 సీట్లు ఉన్నాయని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించి మార్కులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment