బాసర, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నాసాకు ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిం చేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అమత్య్రా కంపెనీ నాసా ఆధ్వర్యంలో నాసా ఆర్బిటాళ్ల స్పేస్ సెటిల్‌మెంట్ ప్రాజెక్ట్‌కు ట్రిపుల్ ఐటీ రెండో(పీయూసీ-2) సంవత్సరం విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి సత్యనారాయణ తెలిపారు.
హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన షేక్ మనీషా బానూ, డి.చెన్నరాయుడు, మల్కాజ్‌గిరికి చెందిన సంతోష్, షేక్‌పేట మండలం ద్వారకానగర్‌కు చెందిన నవ్య గోసిక, రంగారెడ్డి జిల్లాకు చెందిన పల్లవీరావు నాసాకు ఎంపికైన వారిలో ఉన్నారు.