
12మంది ఉద్యోగాలకు ఎంపిక
వేంపల్లె(ఇడుపులపాయ) : ఆర్‌కె వ్యాలీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో శనివారం టెక్ మహేంద్ర సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. 12మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ తెలిపారు.ఈసీఈ విభాగం నుంచి 8మంది,మెకానికల్ నుండి ముగ్గురు,సివిల్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.వీరికి ఏడాదికి రూ.3.25 లక్షలు వేతనం అందజేయనున్నట్లు టెక్ మహేంద్ర అధికారులు శ్రీధర్,సుధాకర్,శ్యామ్‌సుందర్‌లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్ భగవన్నారాయణ,కెయల్‌యన్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,ప్లేస్ మెంట్ అధికారులు లక్ష్మణ్ నాయక్,అశోక్ తదితరులు అభినందించారు.