ఇబ్రహీంపట్నం: ఆన్‌లైన్‌లో బస్‌పాస్‌లు జారీచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కళాశాలలు ప్రారంభమై పది రోజులు పూర్తైన ఇప్పటి వరకు బస్సుపాసులు జారి చేయకపోవడంతో.. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బస్టాండ్ ఎదుట ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్‌స్టేషన్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ముట్టడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు.