
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. వర్సిటీలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థుల సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగానే నిరసనకారులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రధాని మోదీ సభ వద్ద నిరసనలు తెలపాలని అటుగా వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం
Comments
Please login to add a commentAdd a comment