హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని వారు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో తరగతులను బహిష్కరించి కాలేజీ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.