గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన అధ్యాపకులు రత్నప్రసాద్, కృష్ణ ప్రసాద్‌జీ, ప్రసూన రాణి తో పాటు మరొకరిని వెంటనే బదిలీ చేయాలని 10 రోజులుగా కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ యంత్రాంగం విద్యార్థులతో మాట్లాడినా విషయం సద్దుమణగకపోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే సదరు అధ్యాపకులను బదిలీ చేసేంతవరకు ఆందోళన విరమించమని విద్యార్థులు తెలిపారు.