
సాక్షి, వరంగల్: నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన పీహెచ్‌డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఫీజులు తగ్గించాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పరిపాలన భవనం అద్ధాలు ధ్వంసమయ్యాయి.