PhD scholar
-
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
విచిత్ర విధి.. ఒకటి కాదు రెండు ప్రాణాలు బలి!
బెంగళూరు: దేశ వ్యాప్తంగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో.. ఎన్నో విషాదాలు జరిగి ఉండొచ్చు. వందల నుంచి వేల మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు. కానీ, కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఘటన మాత్రం విధి ఎంత విచిత్రమైందో అని అనిపించేలా ఉంది. శివమొగ్గ విద్యానగర్‌లో జరిగిన కొత్త సంవత్సరం వేడుక.. ఇద్దరి ప్రాణాలు బలిగొంది. వేడుకలో ఓ పెద్దాయన అతి ప్రదర్శనకు దిగబోయాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త ఓ రీసెర్చ్ స్కాలర్‌ను బలి తీసుకోవడంతో పాటు తన ప్రాణం పొగొట్టుకున్నాడు కూడా. బిజ్‌మన్ మంజునాథ్ ఒలేకార్(67) అనే వ్యాపారవేత్త విద్యానగర్ 4వ క్రాస్‌లో కొత్త సంవత్సరం వేడుకను నిర్వహించాడు. ఆ ఈవెంట్‌కు కుటుంబంతో పాటు స్నేహితులను 50 మంది దాకా ఆహ్వానించాడు. అంతా పార్టీలో మునిగి తేలాక.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు తన డబుల్ బ్యారెల్ గన్ను పేల్చడానికి సిద్ధం అయ్యారు. సరిగ్గా 12 గంటల సమయంలో తూటా అమర్చి పేల్చే యత్నం చేశాడు. అయితే.. అది పొరపాటున పేలి తన పక్కనే ఉన్న వినయ్(34) అనే యువకుడిలోకి తూటా దూసుకెళ్లింది. వెంటనే వినయ్‌ని ఆస్పత్రికి తరలించారు అక్కడున్నవాళ్లు. అయితే ఆ ఘటనతో ఒలేకార్ షాక్ తిన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వినయ్‌కి ఏమైందోనని భయాందోళనకు గురయ్యాడు. ఆ క్రమంలో ఊపిరి ఆడక.. అక్కడికక్కడే కుప్పకూలాడు. షాక్‌లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు వినయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశాడు. ఒలేకర్ కొడుకు స్నేహితుడైన వినయ్.. పీహెచ్డీ స్కాలర్. అతని తండ్రి పీడబ్ల్యూడీ ఇంజినీర్. మంజునాథ్ ఒలేకార్ కాల్చింది లైసెన్స్డ్ రివాల్వర్ అవునా? కాదా? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. గతంలోనూ ఆయన ఇలా బహిరంగంగా తుపాకినీ గాల్లోకి కాల్చాడని స్థానికులు కొందరు చెప్తున్నారు. -
‘ప్రియుడి’ హత్య.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
ముంబై: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు.. 30 ఏళ్ల పీహెచ్డీ స్కాలర్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కారణం ఏంటంటే ఈ ఇద్దరు యువకులు కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్డీ స్కాలర్‌కి పెళ్లి కుదరడంతో.. తట్టుకోలేకపోయిన నిందితుడు అతడిని హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తోన్న రవిరాజ్ క్షీరసాగర్(24)కి, పుణె నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న సుదర్శన్ బాబురావు పండిట్(30)తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలో సుదర్శన్‌కి కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం రవిరాజ్ చేవిన పడింది. తనను వదిలి పెట్టి మరోక యువతిని వివాహం చేసుకోవడానికి వీల్లేదని సుదర్శన్‌ని హెచ్చరించాడు రవిరాజ్. అయితే సుదర్శన్ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 27న రవిరాజ్, సుదర్శన్ పీహెచ్డీ చేస్తోన్న నేషనల్ కెమికల్ లాబొరేటరీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని సుదర్శన్ తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవిరాజ్ అతడిని దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి.. ముఖాన్ని రాళ్లతో కొట్టి గుర్తుపట్టరాని విధంగా మార్చాడు. ఆ తర్వాత రవిరాజ్ తన నివాసానికి వెళ్లి ఆత్మహత్యయాత్నం చేశాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక నేషనల్ లాబొరేటరీలో హత్యకు గురైన సుదర్శన్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. అతడి వద్ద లభించిన డాక్యుమెంట్స్‌ని బట్టి మరణించిన వ్యక్తిని సుదర్శన్‌గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రవిరాజ్‌తో అతడికున్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు రవిరాజ్ గురించి వాకబు చేయగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. దాంతో పోలీసులు హస్పిటల్‌కి వెళ్లి రవిరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో తానే సుదర్శన్‌ని హత్య చేశానని అంగీకరించాడు రవిరాజ్. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్.. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది -
పీహెచ్డీ చేసి.. కూరగాయలు అమ్ముతోంది
భోపాల్: ఇండోర్‌లోని ఓ కూరగాయల మార్కెట్లో మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ యువతి నిరసన తెలుపుతోంది. చుట్టు ఉన్నవారు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిరసన తెలిపితే ఆశ్చర్యం పోవడం ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్‌లో నిరసన తెలుపుతుండటంతో చుట్టు ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైసా అన్సారీ అనే యువతి ఇండోర్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటిరియల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసింది. కానీ ఉద్యోగం లభించలేదు. ఇదిలా ఉండగానే.. కరోనా వచ్చి పరిస్థితులను మరింత దిగజార్చింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) In Indore a vegetable vendor Raisa Ansari protested against the municipal authorities when they came to remove the handcarts of vegetables.The woman later claimed that she has done Phd in Materials Science from DAVV Indore. @ndtvindia @ndtv @GargiRawat #lockdown #COVID19 pic.twitter.com/RieGffTMyP — Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020 ఈ క్రమంలో సదరు యువతి కుటుంబానికి తోడుగా ఉండాలని భావించింది. దాంతో ఓ తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. గురువారం మున్సిపల్ అధికారలు వచ్చి.. రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దాంతో అన్సారీ మిగితావారితో కలిసి మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. అధికారులు తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో స్పష్టమైన ఇంగ్లీష్‌లో తెలిపింది. ఈ సదర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. ‘ఓ పక్క మార్కెట్‌ను క్లోజ్ చేశారు. కూరగాయలు కొనడానికి ఎవరూ రావడం లేదు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులం 20 మంది దాకా ఇలా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ అధికారులు వచ్చి బండ్లను తొలగించమంటున్నారు. మరి మేం ఏం తిని బతకాలి’ అని ప్రశ్నించారు. (రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి) ఇంతలో కొందరు ‘ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు.. ఏం చదివారు’ అని అన్సారీని అడిగితే పీహెచ్డీ చేశానని చెప్పారు. ‘మరి ఉద్యోగం చేయవచ్చుగా’ అని అడిగితే.. నా పేరు చూసి ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రస్తుం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
వెరైటీ ఫొటోషూట్..కంగ్రాట్స్!!
ప్రస్తుతం ఫొటోషూట్ల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం ఏదైనా సరే తమ ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. ముఖ్యంగా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో ఈ సందడి మామూలుగా ఉండదు. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా లేకుండా మహిళలంతా బేబీ బంప్ ఫొటోషూట్లతో హల్చల్ చేస్తున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ ఆ ఙ్ఞాపకాలను పదిలపరచుకుంటున్నారు. జార్జియాకు చెందిన సారా వీలెన్ కర్టిస్ అనే మహిళ కూడా ఇలాంటి ఫోటోషూట్‌తో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే ఒక విషయం... మీరు అనుకుంటున్నట్టుగా సారా గర్భవతి కాదు.. కానీ ఆమె చేసింది మాత్రం బేబీ బంప్ షూటే. ఏంటి అదెలా సాధ్యం అనుకుంటున్నారా...అవును..తను బిడ్డలా భావించే పీహెచ్డీ థీసిస్‌తో ఆమె ఫొటోషూట్ నిర్వహించారు. ‘ నేను నా థీసిస్‌తో ఫొటోషూట్ చేశాను. లాంగెస్ట్ లేబర్ ఎవర్’ అని ట్వీట్ చేసి.. పీహెచ్డీ లైఫ్ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. వినూత్నంగా ఉన్న ఆమె ట్వీట్‌కు 66 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలో ‘ అవును పీహెచ్డీ చేయడం అంటే బిడ్డను కనడం కంటే తక్కువేమీ కాదు. నాకు ఇప్పుడు 66 వ నెల. ఇంకెప్పుడు పూర్తవుతుందో’ అంటూ ఓ పీహెచ్డీ స్కాలర్ కామెంట్ చేశాడు. ఇక మరికొంత మంది..‘ కంగ్రాట్స్. సాధారణంగా డాక్టర్లు.. తల్లి చేతిలో బిడ్డను పెడతారు. కానీ మీరు మాత్రం బిడ్డ పుట్టాక డాక్టర్ అవుతారు’ అని చమత్కరిస్తున్నారు. ఇంతకీ సారా పరిశోధన చేస్తున్న అంశం ఏంటంటే.. ఎపిజెనెటిక్ వేరియేషన్ అండ్ ఎక్స్పోజర్ టు ఎండోక్రిన్ డిస్రప్టింగ్ కాంపౌండ్స్(DNA క్రమంలో మార్పులు కాకుండా జన్యు సమాసంలో సంభవించే సంక్రమిత మార్పులు-వాటికి దారితీసే అంశాలు). Yes, I did a photo shoot with my thesis. Longest labor ever. #phdlife pic.twitter.com/wpGdFPANd6 — Sarah Whelan Curtis (@sarahwcurtis) June 4, 2019 -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన పీహెచ్డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఫీజులు తగ్గించాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పరిపాలన భవనం అద్ధాలు ధ్వంసమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిరోగమనంలో ‘పరిశోధనలు’
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య. దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్‌ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ -
'మీ అక్క కోసమైనా తిరిగొచ్చేయ్‌రా నాన్నా'
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో కనిపించకుండా పోయిన ఓ పీహెచ్డీ స్కాలర్ గన్ తో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చాడు. అది కూడా ఉగ్రవాదులు ఉపయోగించే గన్‌తో కనిపించి. అంతేకాదు, అతడు తమ సంస్థలో చేరినట్లు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా స్పష్టం చేసింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తోన్న మనన్ బషిర్ వాని ఇటీవలె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు సైతం హైరానా పడుతున్న తరుణంలో అనూహ్యంగా అతడు ఏకే 47 గన్ పట్టుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర రోదనలో మునిగిపోయారు. మరోపక్క, అతడు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ స్పందిస్తూ భారత్ నిర్లక్ష్యం కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా కశ్మీర్ యువత తమతో చేతులు కలుపుతోందంటూ ప్రకటన చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మనన్ తల్లి తిరిగి రావాలని మీడియా ద్వారా తన కుమారుడికి విజ్ఞప్తి చేస్తూ బోరున విలపించింది. 'నాన్న మనన్.. మీ అమ్మ ఏడుస్తోంది రా.. దయచేసి వెనక్కి వచ్చేయి. మీ అక్క పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూడు. మీ అక్క కోసం అయినా తిరిగొచ్చేయిరా.. నువ్వు ఎప్పుడూ మీ అక్కకు అండగా ఉన్నావు' అంటూ మనన్ తల్లి షమీమా రోధించింది. -
ఇజ్రాయెల్‌లో తెలుగు విద్యార్థి మృతి
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పరిశోధక విద్యార్థి ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడిని రామకుప్పం మండలం అనిగానూరుకు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. రాజ్‌కుమార్ ఇజ్రాయెల్ దేశంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అయితే, రాజ్‌కుమార్ ఏదైనా అస్వస్థతకు గురై మరణించాడా లేదా ఏదైనా ఘోరం జరిగిందా అనే విషయం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య జరిగి.. పెను వివాదం చెలరేగిన నెలలోపే మరో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసారి కూడా సెంట్రల్ యూనివర్సిటీలోనే. అయితే అది హైదరాబాద్ కాదు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ. మోహిత్ చౌహాన్ (27) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించాడు. అతడి హాస్టల్ గదిలో కొన్ని పత్రాలు లభించినా, సూసైడ్ నోట్ అవునో కాదో పోలీసులు నిర్ధారించలేదు. అయితే, సీనియర్ అధ్యాపకుడి వేధింపుల కారణంగానే చౌహాన్ బాగా డిప్రెస్ అయ్యాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. సాయంత్రం కూడా హాస్టల్ స్నేహితులతోనే కలిసి మాట్లాడుతున్నాడని, ఉన్నట్టుండి మధ్యలో లేచి రూంలోకి వెళ్లాడని అజ్మీర్ ఐజీ మాలినీ అగర్వాల్ చెప్పారు. డిన్నర్ కోసం అతడికి కాల్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయలేదని.. ఏంటా అని రూంకి వెళ్లి చూస్తే చౌహాన్ అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్నేహితులు కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. -
న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.