సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య | phd scholar from central university ends life | Sakshi
Sakshi News home page

సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Feb 6 2016 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య జరిగి.. పెను వివాదం చెలరేగిన నెలలోపే మరో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసారి కూడా సెంట్రల్ యూనివర్సిటీలోనే. అయితే అది హైదరాబాద్ కాదు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ. మోహిత్ చౌహాన్ (27) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించాడు. అతడి హాస్టల్ గదిలో కొన్ని పత్రాలు లభించినా, సూసైడ్ నోట్ అవునో కాదో పోలీసులు నిర్ధారించలేదు. అయితే, సీనియర్ అధ్యాపకుడి వేధింపుల కారణంగానే చౌహాన్ బాగా డిప్రెస్ అయ్యాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు.  

సాయంత్రం కూడా హాస్టల్ స్నేహితులతోనే కలిసి మాట్లాడుతున్నాడని, ఉన్నట్టుండి మధ్యలో లేచి రూంలోకి వెళ్లాడని అజ్మీర్ ఐజీ మాలినీ అగర్వాల్ చెప్పారు. డిన్నర్ కోసం అతడికి కాల్‌ చేసినా ఫోన్ ఆన్సర్ చేయలేదని.. ఏంటా అని రూంకి వెళ్లి చూస్తే చౌహాన్ అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్నేహితులు కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement