జంబ్లింగ్ విధానం ఎత్తి వేయాలంటూ... | Students take out rally against jumbling system | Sakshi
Sakshi News home page

జంబ్లింగ్ విధానం ఎత్తి వేయాలంటూ...

Published Mon, Jan 4 2016 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

Students take out rally against jumbling system

పిడుగురాళ్ల: ఇంటర్ మీడియట్ లో నిర్వహించే ప్రాక్టికల్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలంటూ.. విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాలలను బహిష్కరించి సుమారు 800 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రం జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసిందని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విధానం కొనసాగించడం సరైంది కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పట్టణంలోని అన్ని కళాశాలలను బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement