విద్యార్థులు చేస్తున్న రాస్తారోకోలో పాల్గొన్న టీపీసీసీ సభ్యుడు సంజీవ్‌రెడ్డి
మనూరు(నారాయణఖేడ్): నాగల్‌గిద్ద మండలం మోర్గి రోడ్డును మరమ్మతులు చేపట్టాలని విద్యా ర్థులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమా న్ని నిర్వహించారు. మోర్గి మోడ్ నుంచి మోర్గి గ్రా మం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తి గా ఛిద్రమై గోతుల మయంగా మారిందని ఆందో ళన వ్యక్తం చేశారు. మోర్గిలో ఉన్న మోడల్ పాఠశాలకు వెళ్లేందుకు వాహనాలు రావడంలేదన్నా రు.
తాము నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ మోర్గి, గోందేగాం, షాపూర్, నాగల్‌గిద్ద, ఎర్రబొగుడ, శేరిదామర్‌గిద్దకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9గంటల నుంచి 11గంటలకు వరకు రోడ్డుపైన ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా విద్యార్థులు రోడ్డు నిర్మించాలని ఆందోళన నినాదాలతో మారుమోగింది.
విద్యార్థులకు మద్దతు తెలిపిన సంజీవ్‌రెడ్డి
విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు, ఖేడ్ ఎంపీపీ సంజీవ్‌రెడ్డి రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. గతంలో షాపూర్, ఎర్రబొగుడ గ్రామాలకు సంబంధించి రోడ్లు కావాలని తాము ధర్నా చెయ్యడంతోనే ఇటీవలే నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. అనంతరం వారు నాగల్‌గిద్దలోని తహసీల్ కార్యాలయలో వినతి పత్రం అందచేశారు.
కార్యక్రమంలో మనూరు మాజీ ఎంపీపీ శంకరయ్యస్వామి, న్యాయవాది సంగన్న, దారం శంకర్, పండరిరెడ్డి, వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు అశోక్, శివ్‌శర్ణప్ప, శ్రీకాంత్, రామ్‌రావు, గుండేరావు, కుషల్‌రావుపాటిల్, సంజీవ్‌పాటిల్ మోడల్ పాఠశాల విద్యార్థులు తదిరతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment