
వైవీయూ (వైఎస్సార్ జిల్లా): అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి, అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ కనిపించింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. దీనికి వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ వేదికైంది. ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో ఈ కీటకాల ఉనికిని కనుగొనగా.. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో దీని ఆచూకీ బయట పడింది.దీంతో ఈ కీటకం గురించి పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.