యోగి వేమన వీసీగా ప్రొ.రామచంద్రారెడ్డి | AP government appoints attipalli ramachandra reddy as Yogi Vemana University Vice-chancellor | Sakshi
Sakshi News home page

యోగి వేమన వీసీగా ప్రొ.రామచంద్రారెడ్డి

Published Fri, Oct 7 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

యోగి వేమన వీసీగా ప్రొ.రామచంద్రారెడ్డి

యోగి వేమన వీసీగా ప్రొ.రామచంద్రారెడ్డి

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయ కొత్త వైస్ చాన్సలర్(వీసీ)గా ప్రొ.అత్తిపల్లి రామచంద్రారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు అత్తిపల్లి యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీగా సేవలందిచనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 
ప్రస్తుతం ఆయన హైదరాబాద్ యూనివర్సిటీ ప్లాంట్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తిపల్లి మొక్కలపై విసృత పరిశోధనలు చేశారు. ఫోటో సింథసిస్(రసాయనిక ప్రక్రియ) మొక్కల ఎదుగుదలకు ఎలా తోడ్పడుతోందనే అంశాన్ని గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు.

ఆయన అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యువ శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించింది. బొటనీలో పరిశోధనలకు ప్రొ.హీరాలాల్ చక్రవర్తి అవార్డు, బయోటక్నాలజీ ఓవర్ సీస్ అసోసియేట్ షిప్ అవార్డులను కూడా అత్తిపల్లి అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement