
నిఖత్ జరీన్, లవ్లీనా, నీతూ, జాస్మిన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment