qualifying matches
-
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. బ్యూనస్ ఎయిర్స్లో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1–0తో ఈక్వెడార్ జట్టును ఓడించింది. 83 వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌లో ఆట 78వ నిమిషంలో కెపె్టన్ మెస్సీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 176 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెస్సీకిది 104వ గోల్ కావడం విశేషం. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో మెస్సీకిది 29వ గోల్. 29 గోల్స్‌తో లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కొలంబియా 1–0తో వెనిజులాపై గెలుపొందగా... పరాగ్వే–పెరూ మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. 2026 ప్రపంచకప్‌ను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 48 దేశాలు బరిలోకి దిగుతాయి. -
ఐర్లాండ్ ఘన విజయం.. సూపర్ 12 ఆశలు సజీవం
టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూఫ్-బి క్వాలిఫయింగ్ పోరులో బుధవారం స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లు కర్టిస్ కాంఫర్(32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. జార్జ్ డొక్రెల్(27 బంతుల్లో 39 నాటౌట్) కాంఫర్‌కు అండగా నిలిచాడు. అంతకముందు కీపర్ లోర్కాన్ టక్కర్ 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు 72 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడిన కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఓపెనర్ మైకెల్ జోన్స్ (55 బంతుల్లో 86 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 37 పరుగులతో రాణించాడు.ఐర్లాండ్ బౌలర్లలో కర్టీస్ కాంపర్ రెండు వికెట్లు తీయగా.. మార్ అడెయిర్, జోషువా లిటిల్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఐర్లాండ్ తమ సూపర్-12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ చెరొక విజయంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోతే ఆ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. కాబట్టి విండీస్‌కు జింబాబ్వేతో మ్యాచ్ కీలకం కానుంది. చదవండి: T20 WC: ప్రపంచకప్.. సెమీస్ చేరేది ఆ జట్లే! ఇక విజేతగా..: సచిన్ అఫ్రిది యార్కర్ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్ ఓపెనర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
గ్రౌండ్లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్
బ్రెసిలియా: ఫిఫా(FIFA) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా బ్రెజిల్, అర్జెంటీనా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ రసాభాసగా మారింది. అర్జెంటీనాకు చెందిన నలుగురు ఆటగాళ్లు కరోనా నిబంధనలు ఉల్లంఘించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆరోగ్య కార్తకర్తలు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రౌండ్లోకి ప్రవేశించారు. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లఘించిన ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రౌండ్లో కాస్త గందరగోళం నెలకొనడంతో అభిమానులు విషయం అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. విషయంలోకి వెళితే.. అర్జెంటీనాకు చెందిన మార్టినెజ్, జియోవన్నీ, రొమెరో, బుయెండియాలు ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలకు ముందు క్లబ్ తరపున ఆడారు. నిబంధనల ప్రకారం వీరిని ఇంగ్లండ్‌లో 10 రోజుల పాటు క్వారంటైన్లో గడపాలంటూ బ్రెజిల్ ఆరోగ్య శాఖ కోరింది. అయితే కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేయకుండా ఈ నలుగురు ఇంగ్లండ్ నుంచి బ్రెజిల్‌కు వచ్చి మ్యాచ్‌లో పాల్గొన్నారు. మ్యాచ్ ప్రారంభమయిన 10 నిమిషాలకే రద్దు కావడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కాగా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై అభిమానులతో పాటు పలువురు మాజీలు తప్పుబడుతున్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను కాదని మ్యాచ్ ఆడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నైమర్, మెస్సీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనడం మరో విశేషం. చదవండి: మాంచెస్టర్ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత 🚨⚽️ | NEW: Footage shows Brazilian officials entering the pitch during the Brazil vs Argentina game to allegedly detain 4 Argentinian players who had entered the country from England pic.twitter.com/3X0PkNghmN — Football For All (@FootballlForAll) September 5, 2021 -
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
నూర్బర్గ్ (జర్మనీ): మెర్సిడెస్ డ్రైవర్లు మరోసారి సత్తా చాటారు. వరుసగా 11వ రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వాల్తెరి బొటాస్... అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.269 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. తాజా సీజన్లో బొటాస్‌కు ఇది మూడో ‘పోల్’ కావడం విశేషం. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. మరో వైపు ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ ప్రి విజయాల (91 టైటిల్స్) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న లూయిస్ హామిల్టన్... ల్యాప్‌ను 0.256 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. అనారోగ్యంతో రేసిం గ్ పాయింట్ డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో పాటు ప్రధాన రేసుకు కూడా దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని నికో హల్కెన్‌బర్గ్ (జర్మనీ)తో రేసింగ్ పాయింట్ టీమ్ భర్తీ చేసింది. క్వాలిఫయింగ్ సెషన్లో హల్కెన్‌బర్గ్ 20వ స్థానంలో నిలిచి రేసును అందరికంటే చివరగా ఆరంభించనున్నాడు. సీజన్ ఆరంభంలో హల్కెన్‌బర్గ్ రేసింగ్ పాయింట్ తరఫున పాల్గొన్నాడు. -
తొలి ‘సూపర్’ టైటిల్ వేటలో...
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం ఊరిస్తోంది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు నేటి నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలతోపాటు డబుల్స్ విభాగాల మ్యాచ్‌లు ఉన్నాయి. మెయిన్ ‘డ్రా’ సింగిల్స్ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీవెన్ జాంగ్‌పై అలవోకగా నెగ్గిన సింధు మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడే చాన్స్ ఉంది. చైనా ఓపెన్‌లో చోచువోంగ్ చేతిలోనే సింధు ఓడింది. ఈ ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మినహాయిస్తే సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్థానిక క్రీడాకారిణి కిమ్ గా యున్‌తో ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో సైనాకు మూడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)... సింధుకు నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్.. క్వాలిఫయర్‌తో కశ్యప్ తలపడనున్నారు. -
బంగ్లాతో మ్యాచ్: ఒమన్ విజయలక్ష్యం: 181
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో బంగ్లాదేశ్, ఒమన్ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్ జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దాంతో ఒమన్ జట్లుకు బంగ్లాదేశ్181 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్ 22 బంతుల్లో (రెండు ఫోర్లు)తో 12 పరుగులకే చేతులెత్తేశాడు. షబ్బీర్ రహమాన్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి పెవిలీయన్ బాట పట్టాడు. తమీమ్ ఇక్బాల్ సెంచరీ పూర్తి చేసి103 పరుగులతో అద్భుతంగా రాణించి నాటౌట్‌గా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఒమన్ బౌలర్లు లాల్చేతా, ఖావర్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.