బ్రెసిలియా: ఫిఫా(FIFA) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా బ్రెజిల్, అర్జెంటీనా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ రసాభాసగా మారింది. అర్జెంటీనాకు చెందిన నలుగురు ఆటగాళ్లు కరోనా నిబంధనలు ఉల్లంఘించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆరోగ్య కార్తకర్తలు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రౌండ్‌లోకి ప్రవేశించారు. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లఘించిన ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో గ్రౌండ్‌లో కాస్త గందరగోళం నెలకొనడంతో అభిమానులు విషయం అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. విషయంలోకి వెళితే.. అర్జెంటీనాకు చెందిన మార్టినెజ్, జియోవన్నీ, రొమెరో, బుయెండియాలు ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలకు ముందు క్లబ్ తరపున ఆడారు. నిబంధనల ప్రకారం వీరిని ఇంగ్లండ్‌లో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాలంటూ బ్రెజిల్ ఆరోగ్య శాఖ కోరింది.
అయితే కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేయకుండా ఈ నలుగురు ఇంగ్లండ్ నుంచి బ్రెజిల్‌కు వచ్చి మ్యాచ్‌లో పాల్గొన్నారు. మ్యాచ్ ప్రారంభమయిన 10 నిమిషాలకే రద్దు కావడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కాగా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై అభిమానులతో పాటు పలువురు మాజీలు తప్పుబడుతున్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను కాదని మ్యాచ్ ఆడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నైమర్, మెస్సీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనడం మరో విశేషం.
చదవండి: మాంచెస్టర్ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత
🚨⚽️ | NEW: Footage shows Brazilian officials entering the pitch during the Brazil vs Argentina game to allegedly detain 4 Argentinian players who had entered the country from England pic.twitter.com/3X0PkNghmN
— Football For All (@FootballlForAll) September 5, 2021
Comments
Please login to add a commentAdd a comment