
న్యూఢిల్లీ: గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో మెరిసిన భారత బాక్సర్లు కొత్త సీజన్‌లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో భారత బాక్సర్లు మూడు అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగనున్నారు. బల్గేరియాలో జరిగే స్ట్రాండ్‌జా టోర్నీలో... ఆ తర్వాత ఇరాన్‌లో జరిగే టోర్నీలో... ఫిన్‌లాండ్‌లో జరిగే టోర్నీలో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
స్ట్రాండ్‌జా టోర్నీలో భారత్ తరఫున మహిళల విభాగంలో 10 మంది... పురుషుల విభాగంలో తొమ్మిది మంది పోటీపడుతున్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఇరాన్‌లో జరిగే టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యాడు. అతను 52 కేజీల విభాగంలో పోటీపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment