
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బుధవారం జరిగిన 51 కేజీల విభాగంలో సెవ్‌దా అసెనోవ (బల్గేరియా)పై విజయం సాధించింది. బౌట్ తొలి రౌండ్‌లోనే అసెనోవా వైదొలగడంతో నిఖత్ గెలుపు ఖాయమైంది.
పురుషుల తొలి రౌండ్ బౌట్‌లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) 4–1తో ఎంజో గ్రౌ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పురుషుల 63 కేజీల రెండో రౌండ్ బౌట్‌లో శివ థాపా 5–0తో పావెల్ పొలాకోవిచ్ (పోలాండ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment