Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది.
ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు.
స్వర్ణపతకంతో తిరిగి రావాలి
ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment