
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు పతకం ఖాయమైంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్‌తోపాటు అమిత్ ఫంగల్ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), నీరజ్ (60 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో బుర్యామ్ యానా (బెలారస్)పై... మంజు రాణి 5–0తో బొనాటి రొబెర్టా (ఇటలీ)పై... లవ్లీనా 5–0తో సోరెజ్ బీట్రిజ్ (బ్రెజిల్)పై... అమిత్ 3–2తో నజర్ కురోత్‌చిన్ (ఉక్రెయిన్)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment