న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలిపారు. ఒలింపిక్స్ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ప్రారంభం మాత్రమే. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే నా లక్ష్యం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలవడం నా జీవితంలో ఒక కీలక ఘట్టం. ఈ సంతోషాన్ని నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మాయిలు వివిధ క్రీడల్లో దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నార’ని నిఖత్ జరీన్ అన్నారు.
అపూర్వ స్వాగతం
ఇస్తాంబుల్ నుంచి ఆదివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న నిఖత్ జరీన్‌కు క్రీడా శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. (క్లిక్: అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది)
Comments
Please login to add a commentAdd a comment