women boxer
-
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్‌కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్‌పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్‌లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
లిన్ యూ టింగ్ పంచ్ అదిరె...
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్‌తో మెరిసింది. బాక్సింగ్‌లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. ‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్‌లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో లిన్‌తో పాటు ఖలీఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్‌గా నిలిచింది. -
మెచ్చుకోలు, ఆశ్చర్యం, ప్రశ్నార్థకం.. ఆమెను సులువుగా మర్చిపోలేరు! ఎందుకు?
ఢిల్లీలో ఇప్పుడు మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి ఆస్ట్రేలియా బాక్సర్ టినా రహిమి మీద నిలిచింది. ఆమె ప్రపంచంలోనే బహుశా మొదటి హిజాబ్ బాక్సర్. ప్రిలిమినరిస్లోనే రహిమి ఓడిపోయినా హిజాబ్ గురించి ప్రపంచానికి ఉన్న దృష్టి మారడానికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను అని తెలిపింది. ‘ఏం పర్వాలేదు. నా మద్దతుదారులను నిరాశ పరిచాను. కాని 2024 ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాను’ అంది 27 సంవత్సరాల టినా రహిమి. ఆస్ట్రేలియా నుంచి తొమ్మిది మంది బాక్సర్ల బృందంతో ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌కు హాజరైన టినా గట్టి పోరాటం ఇచ్చి ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో వచ్చింది. కాని మన టాలెంటెడ్ బాక్సర్ మనిషా మౌన్ చేతిలో ఓటమి పాలయ్యింది. రింగ్‌లో హిజాబ్ ధరించి తలపడిన ఆమెను మెచ్చుకోలు కళ్లతో, ఆశ్చర్యం కళ్లతో, ప్రశ్నార్థకం కళ్లతో చూసినవారు ఆమెను మర్చిపోవడం మాత్రం కష్టం. ‘అనుకూలంగానో ప్రతికూలంగానో నన్ను అందరూ చూస్తుంటారు. నేను ముస్లింని. నా మతానుసారం దుస్తులు ధరించే స్వేచ్ఛ నాకు ఉంది. నేను ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అవి ఏమాత్రం అడ్డు కాకూడదని భావిస్తాను. నన్ను చూసిన చాలామంది ముస్లిం యువతులు స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఈమె హిజాబ్‌తో ఏకంగా బాక్సింగ్ చేయగలిగితే చదువుకు, ఉద్యోగాలకు అది మనకు ఏం అడ్డం అనుకుంటారు. అలాగే అనుకోవాలని కోరుకుంటాను’ అంది రహిమి. రహిమి 57 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా తరఫున విజయాలు సాధిస్తూ ఉంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో (బర్మింగ్ హామ్) ఫెదర్ వెయిట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెల్చుకునిఆ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా ముస్లింగా నిలిచింది. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో హిజాబ్‌తో బాక్సింగ్ చేసిన మొదటి మహిళగా కూడా. ‘ఇప్పటి వరకూ నా హిజాబ్ గురించి ఎటువంటి అభ్యంతరం రాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె. సిడ్నిలో స్థిరబడి ఆస్ట్రేలియన్ జాతీయత స్వీకరించిన ఈ ఇరానియన్ మహిళ అక్కడ మేకప్ ఉమెన్‌గా ఉపాధి పొందుతోంది. ‘అయితే 2017లో జిమ్‌లో నేను, నా స్నేహితురాలు సరదాగా స్త్రీల బాక్సింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాం. బ్యాగ్‌లను పంచ్ చేస్తుంటే మంచి కిక్‌గా అనిపించింది. ఆ సరదా కాస్త సీరియస్ ప్రాక్టీసుగా మారింది. 2018 నాటికి నేను క్వాలిఫైడ్ బాక్సర్‌గా మారాను’ అంటుంది రహిమి. ఆస్ట్రేలియాలో ముస్లిం అథ్లెట్లకు మంచి ప్రోత్సాహం ఉంది. ప్రతి ఏటా అక్కడ ‘ఆస్ట్రేలియా ముస్లిం అచీవ్మెంట్ అవార్డ్స్’ ఇస్తారు. గత సంవత్సరం రహిమికి ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించారు. ‘హిజాబ్ వారి వారి ఎంపిక. ఎంచుకున్న వారికి అది ఏ విధంగానూ అడ్డు కాదు’ అంటుంది రహిమి. ‘ఇప్పటి వరకూ నా హిజాబ్ గురించి ఎటువంటి అభ్యంతరంరాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె. చదవండి: Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ -
బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది. 🙏 pic.twitter.com/2NJ79xmPxH — Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022 ఈ కారణంగా తన ప్రాక్టీస్ ఆగిపోయిందని, వరల్డ్ ఛాంపియన్షిప్ సమయంలో కూడా బీఎఫ్ఐ ఇలాగే తనతో డర్టీ పాలిటిక్స్ చేసిందని పేర్కొంది. బీఎఫ్ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో మూడు రోజుల్లో (జులై 28) కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..? -
ఇది ఆరంభం మాత్రమే.. అదే నా లక్ష్యం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలిపారు. ఒలింపిక్స్ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ప్రారంభం మాత్రమే. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే నా లక్ష్యం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలవడం నా జీవితంలో ఒక కీలక ఘట్టం. ఈ సంతోషాన్ని నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మాయిలు వివిధ క్రీడల్లో దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నార’ని నిఖత్ జరీన్ అన్నారు. అపూర్వ స్వాగతం ఇస్తాంబుల్ నుంచి ఆదివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న నిఖత్ జరీన్‌కు క్రీడా శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. (క్లిక్: అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది) -
ఫిట్నెస్ ఛాంపియన్
దీప్తికి ఫిట్‌గా ఉండడం ఇష్టం. అందరినీ తనలా ఫిట్‌గా ఉంచడం ఇంకా ఇష్టం. క్రీడలన్నా క్రీడాకారులన్నా కూడా ఎంతో ఇష్టం. వారిని విజయం వైపు నడిపించడంలో తానూ భాగం పంచుకోవడం మహా ఇష్టం. ఈ ఇష్టాలన్నీ మేళవించి క్రీడాకారులకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారామె. పేరొందిన మహిళా బైక్ రేసర్లు, బాక్సింగ్ ఛాంపియన్లకు కూడా ఫిట్నెస్ పాఠాలు బోధిస్తున్న ఈ తెలుగు కోచ్... ఫిట్‌గా ఉంటేనే ఏ రంగంలోనైనా హిట్ కొడతామని అంటున్నారు. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. కాలేజీ రోజుల నుంచీ.. ఫిట్నెస్ మీద ఇష్టంతో విభిన్న రకాల వ్యాయామ శైలులను సాధన చేశాను. అలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఎంబీయే చేశాక స్వంతంగా మార్కెటింగ్ కంపెనీ ప్రారంభించాను. పొద్దస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చోవడంతో ఏదో మిస్ అవుతున్నాను అనిపించేది. అదే సమయంలో పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ఆరోగ్యం విషయంలోనూ కొన్ని తేడాలు కనిపించాయి. కాలేజీ రోజుల్లో లేని ఈ సమస్య అంతా కూర్చుని చేసే జాబ్ వల్లే అని అర్ధమయ్యాక... మార్కెటింగ్ కంపెనీకి గుడ్‌బై చెప్పేశాను. కిక్ ఇచ్చింది మునుపటి ఫిట్నెస్ను సాధించడంతో పాటే ఇక ఈ రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఫిట్నెస్ ట్రైనర్‌గా కూడా మారాను. అలా కొనసాగుతూనే ఈ రంగంలో ఉన్న మిగతా దారులనూ వెతికాను. క్రీడాకారులకు ఫిట్నెస్ కోచ్‌గా ఉండటం చాలా ఆసక్తిగా అనిపించింది. కిక్‌బాక్సింగ్‌లో మూడేళ్లు జాక్సన్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. క్రీడాకారులకు ట్రైనర్‌గా మారడానికి ముందు అన్ని రకాలుగా అధ్యయనం చేశాను. వారి మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకున్నాను. నేనూ అలవరచుకున్నాను. ఇంటర్నేషనల్ సర్ఫర్స్, సెయిలర్స్, స్విమ్మర్స్.. ఇలా ఎక్కువ మంది క్రీడాకారులు చెన్నైలో ఉన్నారు. అక్కడైతే మరింత మందికి నా సేవలు అందించవచ్చునని మూడున్నరేళ్ల క్రితం చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. స్పోర్ట్స్ పర్సన్స్‌కి కోచ్‌గా ఉంటూనే ఇప్పుడు ఎఫ్ 45 పేరుతో రెండు ఫిట్నెస్ స్టూడియోలను నడుపుతున్నాను. ఆట.. బాట అంతర్జాతీయ సర్ఫ్, సెయిలర్స్, స్విమ్మర్స్.. ఇలా అన్ని కేటగిరీలో స్పోర్ట్స్ టాపర్స్ పలువురికి మా స్టూడియోలో శిక్షణ అందిస్తున్నాం. నా ఆధ్వర్యంలో 25 మంది ట్రైనర్లు ఉన్నారు. వీరందరితో కలిసి పూర్తి ట్రైనింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాను. వ్యక్తిగతంగా స్పోర్ట్స్ పీపుల్ని ట్రైన్ చేయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. క్రీడాకారులు ట్రోఫీలు, ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి క్రీడాకారుల విజయాల్లో భాగం పంచుకోవడం అనేది చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిమేల్ రేసర్ బైక్‌లో నెంబర్ వన్ అయిన అలీషా అబ్దుల్లాకు రెండేళ్లుగా పర్సనల్ ట్రైనర్‌గా ఉన్నాను. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ నేప«థ్యంలో సినిమాలు బాగా తయారవుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు జాన్కొకేన్ ఓ బాక్సింగ్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ మూవీ కోసం జాన్ని మూడు నెలలుగా ట్రైన్ చేస్తున్నాం. భరత్ తదితర సినిమా సెలబ్రిటీలూ మా ఫిట్నెస్ స్టూడియోలకు వస్తారు. మండే మాంక్ కండలు తిరిగిన దేహం వంటివి కాకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉండడమే చాలా మంది లక్ష్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని శారీరక, మానసిక, భావోద్వేగాలకు సంబంధించిన ప్రయోజనాలు అన్నీ మేళవించి అందిస్తూ 55 నిమిషాల్లో చేసే వ్యాయామం పరిచయం చేస్తున్నా. మండే మాంక్ పేరుతో ఫిట్నెస్ యాప్, వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నాను. దీంట్లో మెంటల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? ఫిజికల్లీ ఫిట్‌గా ఎలా ఉండాలి? సైకియాట్రిస్ట్, న్యూట్రీషియన్ సూచనలు... ఇవన్నీ ఉంటాయి. ఏ ప్రాంతానికి తగిన ఆహారపు అలవాట్లను బేస్ చేసుకుంటూ డైట్‌కు సంబంధించిన సూచనలు అందిస్తున్నాం. ఇళ్లలో ఉండేవారు, ఆఫీసుల్లో వర్క్ చేసేవారు ఎవరికి ఏ విధమైన ఫిట్నెస్ అవసరమో అలాంటివి మండేమాంక్లో చేర్చాం. మూడు నెలల్లో ఈ యాప్‌ని లాంచ్ చేస్తాను. మండేమాంక్ పేరుతో ఏపీ, తెలంగాణలోనూ స్టూడియోలను ప్రారంభించబోతున్నా. మూడేళ్లలో 75 çస్టూడియోలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మెట్రో నగరాల్లోనే కాకుండా మిగతా పట్టణాల్లోనూ ఫిట్నెస్ స్టూడియోలను చేరువ చేయాలని నా ఉద్దేశం’’ అని తెలిపారు దీప్తి. – ఎస్.సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మంజు ‘రజత’ పంచ్
ఉలన్ ఉడే: పసిడి ‘పంచ్’ విసరాలని ఆశించిన భారత మహిళా బాక్సర్ మంజు రాణికి నిరాశ ఎదురైంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమెకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో మంజు 1–4తో ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా) చేతిలో ఓడింది. ఈ పోటీల్లో భారత్ మూడు కాంస్యాలు, ఒక రజతంతో మొత్తం నాలుగు పతకాలను సాధించింది. సెమీస్‌లో ఓడిన మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), లవ్లీనా (69 కేజీలు)లకు కాంస్యాలు లభించాయి. -
నా రిటైర్మెంట్ అప్పుడే.. మేరీకోమ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన రిటైర్మెంట్ ప్రణాళికలను గురువారం వెల్లడించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఈ 36 ఏళ్ల మణిపురీ బాక్సర్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాతే ఆటకు గుడ్‌బై చెబుతానని ప్రకటించింది. ‘2020 టోక్యో ఒలింపిక్స్ అనంతరం రిటైర్మెంట్ తీసుకుంటా. అంతకన్నా ముందు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే నా దృష్టి ఉంది’ అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ తెలిపింది. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మేరీకోమ్ ఎన్నో ఘనతలు సాధించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్స్‌లో కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతకాలను దక్కించుకుంది. రింగ్‌లో దిగిన ప్రతీసారి పతకం సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది. ‘దేశానికి పతకం అందించేందుకు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. కచ్చితంగా స్వర్ణం గెలవడమే లక్ష్యంగా బరిలో దిగుతా. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నా’ అని మేరీకోమ్ పేర్కొంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగనుండటంతో క్వాలిఫయర్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు క్వాలిఫయింగ్ పోటీలు జరుగనున్నాయి. అర్హత పోటీలను వచ్చే ఏడాది నిర్వహించడం పట్ల మేరీకోమ్ హర్షం వ్యక్తం చేసింది. -
సరితపై ఏడాది నిషేధం
కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్లు జీఎస్ సంధూకు మినహాయింపు ఏఐబీఏ నిర్ణయం న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకు అమల్లోకి ఉంటుంది. తీవ్రమైన చర్యలు తప్పవని మొదట్లో సంకేతాలు వచ్చినా... నిషేధం తక్కువగా ఉండటంతో సరితా దేవి బాక్సింగ్ కెరీర్‌కు పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె ఒలింపిక్స్ అర్హత టోర్నీ అయిన 2016 మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో ఉండనుంది. ‘ఏఐబీఏ నిర్ణయం నాకు ఊరటనిచ్చింది. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన బాక్సింగ్ ఇండియా, కేంద్ర క్రీడల మంత్రికి, సచిన్ టెండూల్కర్‌కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. కాబట్టి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరింత కష్టపడతా’ అని సరిత పేర్కొంది. ఈ సంఘటనలో జాతీయ కోచ్ గురుబక్ష్ (జీఎస్) సింగ్ సంధూ, సాగర్ మైదయాల్ల తప్పులేదని ఏఐబీఏ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. అయితే భారత్‌కు పని చేస్తున్న విదేశీ కోచ్ బ్లాస్ ఇగ్లేసియాస్ ఫెర్నాండెజ్‌ను మాత్రం కఠినంగా శిక్షించింది. ఆయనపై రెండేళ్ల నిషేధంతో పాటు 2 వేల స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా విధించింది. 2014 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. సరితా వ్యక్తిగత కోచ్ లెనిన్ మిటెటీపై ఏడాది, బౌట్ సందర్భంగా అనధికారికంగా రింగ్‌లో ఉన్నందుకు బాక్సర్ భర్త తొయిబా సింగ్‌పై రెండేళ్ల సస్పెన్షన్ విధించింది. సరితపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తాజాగా ఏఐబీఏకు లేఖ రాస్తామన్నారు.