స్వర్ణం నెగ్గిన చైనీస్ తైపీ వివాదాస్పద మహిళా బాక్సర్
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్‌తో మెరిసింది. బాక్సింగ్‌లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం.
‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది.
వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్‌లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్‌పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది.
గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌లో లిన్‌తో పాటు ఖలీఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment